• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MAHARASTHRA JALGON POLICE BUSTS MATTRESS MAKING FACTORY FOUND USING DISCARDED MASKS SRD

ఛీ..ఇంత దారుణమా..వాడి పడేసిన మాస్క్ లతో వ్యాపారమా..దేనికి ఉపయోగిస్తున్నారో తెలుసా..

ఛీ..ఇంత దారుణమా..వాడి పడేసిన మాస్క్ లతో వ్యాపారమా..దేనికి ఉపయోగిస్తున్నారో తెలుసా..

ఛీ..ఇంత దారుణమా..వాడి పడేసిన మాస్క్ లతో వ్యాపారమా..దేనికి ఉపయోగిస్తున్నారో తెలుసా..

కొంతమంది వ్యక్తులు తమ జీవితం , తమ వ్యాపారం అంటూ తమకోసం మాత్రమే ఆలోచిస్తారు.. అలాగే జీవిస్తారు. వ్యాపారం ఏదైనా లాభమే లక్ష్యంగా పనిచేస్తున్నారు కొందరు స్వార్థపు వ్యాపారులు.

  • Share this:
    కరోనా వచ్చిన తర్వాత మాస్క్ మస్ట్ అయింది. మాస్క్ ధరించకపోతే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, మాస్క్ ఉపయోగం తీరిన తర్వాత కొందరు వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఇప్పుడు వాటినే వ్యాపారంగా మార్చుకున్నారు కకృతి గాళ్లు. వ్యాపారం ఏదైనా లాభమే లక్ష్యంగా పనిచేస్తున్నారు కొందరు స్వార్థపు వ్యాపారులు. ఇందుకు ప్రజల ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. కాదేదీ మోసానికి అనర్హం అన్నట్లు రెచ్చిపోతున్నారు. తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఓ సంఘటనను చూస్తే ఇది పీక్స్‌కు వెళ్లినట్లు కనిపిస్తోంది. కరోనా కష్ట కాలాన్ని కూడా తమ స్వార్థ ఆలోచనకు వాడుకుంటున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు.ఇంతకీ విషయమేంటంటే.. కరోనా సమయంలో మాస్కుల వినియోగం తప్పనిసరిగా మారింది. చాలా మంది వస్త్రంతో చేసిన మాస్కుల కంటే వాడి పడేసే మాస్కులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా బయట తిరిగే వారు మాస్కులను ఇంటికి ఎందుకు తీసుకెళ్లడమనే ఉద్దేశంతో వీటిని ఉపయోగిస్తున్నారు. ఇంట్లోకి వెళ్లే సమయంలో ఈ మాస్కులను దగ్గరల్లో ఉన్న చెత్త కుప్పల్లోనే మరో చోట పడేసి వెళుతుంటారు. ఇలాంటి వాడి పడేసిన మాస్కులనే తమ అక్రమ దందాదకు వాడుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు.

    మహారాష్ట్రలోని జల్గావ్‌ పట్టణంలో ఓ ఫ్యాక్టరీలో కొందరు పరుపులు తయారు చేస్తున్నారు. పరుపుల్లో దూదిని ఉపయోగించకుండా.. వాడిపడేసిన మాస్క్‌లను వినియోగిస్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఫ్యాక్టరీకి చేరుకొని వారి గుట్టురట్టు చేశారు. పెద్ద మొత్తంలో వాడి పడేసిన మాస్క్‌లు ఉన్నట్లు గుర్తించారు. మాస్కులన్నింటినీ తగులబెట్టి…ఫ్యాక్టరీ యజమానిని అదుపులోకి తీసుకున్నారు.

    ఫ్యాక్టరీ యజమాని అమ్జాద్ అహ్మద్ మన్సూరీపై కేసు నమోదు చేశారు. ఈ నేరంలో భాగస్వామ్యమైన మిగతా వారిని వెతికే పనిలో పడ్డారు పోలీసులు. చూశారుగా.. వాడి పడేసిన మాస్కులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఎన్ని అనర్థాలకు దారి తీస్తున్నాయో కాబట్టి మాస్కులను విసిరేసే ముందు ఓసారి ఆలోచిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు