Man Tries To Offer Daughter As Human Sacrifice For Treasure: ఇప్పటికి కొన్ని చోట్ల మూఢ నమ్మకాలు, మూఢ ఆచారాలు పాటిస్తున్నారు. తమకు జ్వరం వస్తే... ఏదో ఒక తాయత్తు కట్టుకొవడం, మాంత్రికుడిని కలవడం వంటివి చేస్తుంటారు. ఇక కొన్ని గ్రామాలలో ఇప్పటికి చేతబడి, బాణామతి ఉన్నాయని నమ్ముతుంటారు. కొందరు తమకు నిధి దొరికిందని, కానీ దాని కోసం ఇంట్లో వారిని బలివ్వాలని చెబుతుంటారు. ఇలాంటి ఎన్నో ఘటననలు తరచుగా వార్తలలో నిలుస్తుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం యవత్మాల్ లో జరిగింది.
పూర్తి వివరాలు.. మహారాష్ట్రలోని యవత్మాల్ లో దారుణమైన సంఘటన జరిగింది. బాబుల్ గావ్ పరిధిలో.. ఒక తండ్రి తన బిడ్డనే నరబలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దీని కోసం కొద్ది రోజులుగా ఇంటిలో మాంత్రికుడు, మరికొందరితో కలిసి తాంత్రిక పూజలు సైతం చేస్తున్నారు. పూజల తర్వాత.. ఇంటిలో పెరడులో తవ్వడం చేసే వారు. వాళ్ల ఇంట్లో నిధి ఉందని.. కానీ అది ఒకరి బలి కోరుతుందని తాంత్రికుడు ఆ వ్యక్తికి చెప్పాడు. దీంతో అతను తన కూతురుని బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు.
అతనికి ఇద్దరు కూతుళ్లు. ఒక రోజు బాలిక మద్నీ గ్రామంలో ఉండగా ఆమెపై ఇంట్లోని కొందరు అసభ్యంగా కూడా ప్రవర్తించారు. వీరి వేధింపులు భరించలేక బాలిక తన స్నేహితులతో ఇంట్లో జరుగుతున్న విషయాన్ని చెప్పింది. దీంతో అది కాస్త గ్రామస్థుల వరకు వెళ్లింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులకు బాలిక తండ్రి, తాంత్రికుడితో పాటు, మరో ఏడుగురిని అదుపులోనికి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
హర్యానాలోని ఫరీదాబాద్ లో దారుణమైన సంఘటన జరిగింది.
Faridabad Six including woman booked for rape in haryana: హర్యానాలోని ఫరీదాబాద్ లో దారుణమైన సంఘటన జరిగింది. సెక్యురీటి కంపెనీలో పనిచేస్తున్న ఒక మహిళ తోటి, ఉద్యోగిని పనిమీద హోటల్ కు పిలిచిందని వెళ్లింది. అక్కడ ఒక ఊహించని సంఘటన జరిగింది. మహిళచేత ఒక కూల్ డ్రింక్ తాగించారు. ఆ తర్వాత.. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఈ క్రమంలో.. ఆమెపై కొంత మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వీడియో తీశారు.
కాసేపటికి లేచి చూసే సరికి... ఆమెకు పరిస్థితి తెలిసింది. విషయం ఎవరికైన చెబితే.. తమవద్ద ఉన్న వీడియోలను పబ్లిక్ గా షేర్ చేస్తామని ఆమెను బెదిరించారు. వీడియో అడ్డంపెట్టుకుని ఆమెపై కొంత మంది చాలా సార్లు అత్యాచారం చేశారు. ఈ ఘటన 2020లో జరిగింది. దాదాపు రెండేళ్ల పాటు వారి టార్చర్ భరించింది. ఆ తర్వాత.. ఆమె పోలీసులకు జరిగిన దారుణాన్ని తెలిపింది.
వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మహిళతో సహా..ఆరుగురు నిందితులను వీరేంద్ర దహియా, హరి సింగ్, జై ప్రకాష్, సుఖ్‌బీర్, దేవిరామ్‌లుగా గుర్తించి ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Harassment, Maharashtra, School girl