మగబిడ్డ కోసం తొమ్మిది సార్లు గర్భం దాల్చిన ఓ మహిళ చివరకు పదో కాన్పులో అధిక రక్తస్రావం కావడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయవిదారకర ఘటన మహారాష్ట్రలో జరిగింది. కుటుంబం పేరును మోయడానికి మగ పిల్లవాడు కావాలన్న కుటుంబ సభ్యుల కోరిక.. ఆ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర, బీఢ్‌లోని మజల్‌గావ్ దగ్గర మీరా ఏఖండే అనే మహిళకు ఆరుగురు కుమార్తెలున్నారు. ముగ్గురు పుట్టి చనిపోయారు. అయినా.. కొడుకు కావాలన్న కుటుంబ సభ్యుల అత్యాశ ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది.
అప్పటికే తొమ్మిది సార్లు గర్భం దాల్చింది. అయినా.. కొడుకు మాత్రం జన్మించలేదు. పలు కాన్పులతో చాలా బలహీనంగా తయారైంది ఆ మహిళ. అయినా ఆ కుటుంబానికి ఏ మాత్రం జాలి కలగలేదు. ఆమెను కేవలం ఓ పిల్లలు కనే యంత్రంగానే చూశారు..తప్ప మనిషిగా చూడ లేదు. మగపిల్లవాడి కోసం మరో కాన్పుకు బలవంత పెట్టారు. దీంతో పదో కాన్పులో అధిక రక్తస్రావం కావడంతో మృతశిశువుకు జన్మనిచ్చి ప్రాణాలు కోల్పోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.