Woman Fight With leopard: ఒక మహిళ .. ఏకంగా చిరుత పులితోనే పోరాడింది. చిరుత పులి తోకను పట్టుకుని వెనక్కు లాగింది. అంతటితో ఆగకుండా రాళ్లతో కొట్టింది. పులి వెనక భాగంలో పిడిగుద్దులు కురిపించింది.
Woman Fight With leopard: ప్రస్తుత సమాజంలో కొందరు మహిళలు అత్యంత ధైర్య సాహాసాలను ప్రదర్శిస్తున్నారు. అన్ని రంగాలలో రాణిస్తున్నారు. ఈ క్రమంలో.. వారు పురుషులతో సమానంగా తమ ప్రతిభను చూపిస్తున్నాను. ఇక ఒక మహిళ చూపిన సాహాసం, తెగువ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ చూపిన ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఒక మహిళ తాను.. క్రూర జంతువుతో పోరాడింది. అహ్మద్ నగర్ జిల్లాలో మార్చి 25 న ఈ సంఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.
పూర్తి వివరాలు.. మహారాష్ట్రలోని అహ్మాద్ నగర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పార్నర్ తహాసీల్ ఏరియాలోని దరోడి గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సంజన పావాడే, గోరఖ్ దశరథ్ పావాడే దంపతులు. వీరు తమ కుటుంబంతో కలిసి దరోడి గ్రామంలో నివసిస్తున్నారు. అయితే, మార్చి 25 రాత్రి ఒక ఊహించని సంఘటన జరిగింది. వీరి గ్రామంలో అటవీకి దగ్గరలో ఉంటుంది. ఈ క్రమంలో అర్ధరాత్రి వారి ఇంట్లో వాకిట్లో ఏదో అలజడి వచ్చింది. దీంతో సంజన పావాడే కు మెళకువ వచ్చింది. ఆమె వెళ్లి చూసింది. వారింట్లో ఆవులు,మేకలు ఉంటాయి. అప్పుడప్పుడు ఏవైన జంతువులు వాటిపై దాడి చేస్తుంటాయి. తన భర్తను నిద్ర నుంచి లేపింది. వెళ్లి ఒకసారి చూసిరమ్మని కోరింది.
ఈ క్రమంలో.. గోరఖ్ దశరథ్ నిద్రమత్తులోనే ఇంటి తలుపు తీసి బయటకు వెళ్లాడు. అప్పుడు అతనికి ఊహించని పరిణామం ఎదురైంది. ఒక చిరుతపులి.. దశరథ్ పై దాడి చేసింది. అతనిపై పడి.. గాయపరుస్తుంది. దీంతో అతను భయంతో కేకలు వేశాడు. భర్త అరుపులు విన్న భార్య.. సంజన వెంటనే బయటకు వెళ్లి చూసింది. ఒక చిరుతపులి తన భర్తపై దాడిచేయడాన్ని గమనించింది. వెంటనే ఏ మాత్రం భయంలేకుండా వట్టి చేతులతోనే దాని తోకపట్టుకుని వెనక్కు లాగింది.
గట్టిగా అరుస్తు... దానిపై దాడి చేసింది. వీరిద్దరి అరుపులు విన్న ఇంట్లోని వారు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. కర్రలతో,రాళ్లతో చిరుతపులిపై దాడి చేశారు. దీంతో భయపడిపొయిన చిరుతపులి .. అతడిని అక్కడే వదిలేసి పారిపోయింది. దీంతో అతను కొద్దిపాటి గాయలతో బయటపడ్డాడు. దశరథ్ ఆస్పత్రిలో కోలకుంటున్నాడు. సంజన పావాడే చూపిన సాహాసానికి గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు. ఈ రోజు ఆమె చూపిన తెగువతో భర్త ప్రాణాలు నిలుపుకుందని పలువులు ఆమెను అభినందిస్తున్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.