ఓ మహిళ తన భర్తకు తెలియకుండా మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది. అయితే కొద్ది రోజులకు ఈ విషయం ఆమె భర్తకు తెలిసింది. భర్తకు ఈ విషయం తెలియడంతో కంగారు పడిపోయిన భార్య.. ప్రియుడితో కలిసి అతడిని హత్య చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. థానేలోని మన్పడగావ్లో నివాసం ఉంటున్న లక్ష్మి పాటిల్(22).. తన భర్త ప్రవీణ్ పాటిల్ (30) కనిపించడం లేదని జూన్ 4వ తేదీన ఫిర్యాదు చేసింది. దీంతో ప్రవీణ్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే లక్ష్మికి కొద్ది రోజుల క్రితం సన్నీ సాగర్, అరవింద్ అలియాస్ రవీంద్ర రామ్‌లతో పరిచయం ఏర్పడినట్టుగా గుర్తించారు.
సాగర్, అరవింద్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. లక్ష్మికి అరవింద్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్టుగా గుర్తించారు. ఈ విషయం లక్ష్మీ భర్త ప్రవీణ్‌కు కూడా తెలిసింది. ఈ క్రమంలోనే అరవింద్‌తో తనకున్న సంబంధం గురించి తెలుసుకున్న ప్రవీణ్‌ను హత్య చేయాలని లక్ష్మి నిర్ణయించుకుంది. అనంతరం లక్ష్మి, అరవింద్‌లు కలిసి ఇనుప రాడ్డులతో ప్రవీణ్‌ను తీవ్రంగా కొట్టారు. తరువాత గొంతు కోసి హత్య చేశారు. అనంతరం ప్రవీణ్ మృతదేహాన్ని 36 కిలోమీటర్ల దూరానికి తీసుకువెళ్లి కల్వర్ట్ లో పడేసింది. ఇద్దరు మరో ఇద్దరు కూడా సాయం చేశారు.
దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు ప్రవీణ్ మృతదేహాన్ని పడేసిన చోటుకు వెళ్లి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే కుళ్లిన స్థితిలో ఉన్న ప్రవీణ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.