తెల్లవారుజామున 3గంటలు.. ఒంటరిగా వెళ్తున్న 26 ఏళ్ల యువతికి ఏటీఎం సెంటర్లో కనిపించిందో షాకింగ్ సీన్.. చివరకు..

ప్రతీకాత్మక చిత్రం

మహారాష్ట్రలోని ఫల్ఘర్ జిల్లాలో వాసయ్ నగరంలోని వాలివ్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున 3గంటల సమయంలో ఓ 26 ఏళ్ల యువతి నడుస్తూ వస్తోంది. ఏటీఎం దగ్గరకు రాగానే ఆమెకు ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది.

 • Share this:
  తెల్లవారుజామున 3 గంటల సమయం. ఓ యువతి రోడ్డుపై నడుస్తూ వెళ్తోంది. ఇంతలో సడన్ గా ఏటీఎంలో ఓ వ్యక్తి కనిపించాడు. అతడు ఏటీఎంలో దొంగతనం చేయడానికి వచ్చాడని ఆమె గుర్తించింది. అంతే ఆమె అస్సలు ఆలస్యం చేయలేదు. చాటుగా వెళ్లి ఏటీఎం మెషీన్ షట్టర్ ను వేసేసింది. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు హుటాహుటిన వచ్చి ఆ దొంగను పట్టుకున్నారు. అంత రాత్రి వేళలోనూ ఆ యువతి చూపించిన తెగువకు పోలీసులు, స్థానికుల నుంచి ప్రశంసలు వచ్చి పడుతున్నాయి. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని ఫల్ఘర్ జిల్లాలో వాసయ్ నగరంలోని వాలివ్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున 3గంటల సమయంలో ఓ 26 ఏళ్ల యువతి నడుస్తూ వస్తోంది.

  ఏటీఎం దగ్గరకు రాగానే ఆమెకు ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది. ఏటీఎంలో ఓ వ్యక్తి దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. దాన్ని ఆమె కాస్త దూరం నుంచే గమనించింది. ఆమె అస్సలు ఆలస్యం చేయలేదు. చాటుగా వెళ్లి ఏటీఎం షట్టర్ ను మూసేసింది. దీంతో ఆ వ్యక్తి లోపలే ఉండి పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు హుటా హుటిన వచ్చారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
  ఇది కూడా చదవండి: నాకు పిల్లను వెతికి పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో.. అంటూ ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాసిన 26 ఏళ్ల కుర్రాడు

  అంత రాత్రి వేళ ఆ యువతి చూపిన తెగువకు పోలీసులు, స్థానికులు ఫిదా అయ్యారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. దొంగను చూసి, భయపడకుండా, తనకు ఎందుకులే అని ఊరుకోకుండా ఆమె ధైర్యం చేయడం, దొంగ బయటకు పారిపోనీయకుండా చేసి పోలీసులకు ఫోన్ చేయడం పట్ల అంతా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎం నుంచి అతడు డబ్బును చోరీ చేయలేకపోయాడని బ్యాంకు అధికారులు వెల్లడించారు.
  ఇది కూడా చదవండి: నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి.. ఇంట్లోనే భర్తను పూడ్చిపెట్టిన చోట రోజూ నీళ్లు చల్లిన భార్య.. చంపి మంచి పనే చేశానంటూ కామెంట్స్
  Published by:Hasaan Kandula
  First published: