హోమ్ /వార్తలు /క్రైమ్ /

పెద్దలను ఎదురించి పెళ్లి... ప్రేమజంటను గదిలో బంధించి, నిప్పు పెట్టిన తండ్రి...

పెద్దలను ఎదురించి పెళ్లి... ప్రేమజంటను గదిలో బంధించి, నిప్పు పెట్టిన తండ్రి...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వేర్వేరు కులాలకు చెందిన వారి మధ్య ప్రేమ... పెద్దలు ఒప్పుకోకపోవడంతో వారిని ఎదురించి ప్రేమ వివాహం... కుటుంబ పరువు తీసిందనే పగతో కూతురిని నమ్మించి హత్య చేసిన తండ్రి...

దేశంలో మరో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. పెద్దలను ఎదురించి, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న పాపానికి గర్భిణి అని కూడా చూడకుండా ఓ మహిళను బంధించి నిప్పు పెట్టారు కుటుంబసభ్యులు. ఈ దాడిలో ఆమె భర్తకి తీవ్ర గాయాలయ్యాయి. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా నిగోజ్ గ్రామంలో జరిగింది. నిగోజ్ గ్రామానికి చెందిన చంద్రకాంత్, మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేసే రుక్మిణి అనే యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. పెద్దలను ఎదురించి, ప్రేమ పెళ్లి చేసుకున్నారు రుక్మిణి, చంద్రకాంత్. అందరినీ వదిలేసి కుటుంబానికి దూరంగా నివాసం ఏర్పరచుకున్నారు. అయితే కుటుంబం పరువు తీసిందని కన్న కూతురిపై పగ పెంచుకున్నాడు ఆమె తండ్రి. కూతుర్నీ, ఆమె పెళ్లి చేసుకున్న పాపానికి చంద్రకాంత్‌ను చంపేయాలని ఫిక్స్ అయ్యాడు.


తాను మారిపోయానని, అంతా కలిసి ఉందామని చెప్పి కూతురు, అల్లుడికి ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు. తండ్రి మాటలు నమ్మిన రుక్మిణి... భర్త చంద్రకాంత్‌తో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఇంటికి వచ్చిన కూతురు, అల్లుడితో మంచిగా నటించిన కుటుంబసభ్యులు... తర్వాత ఇద్దరినీ ఓ గదిలో బంధించారు. ఆ ఇంటికి నిప్పు పెట్టి అక్కడి నుంచి పారిపోయారు. పక్కింట్లో నుంచి మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు... అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వారు... ఇద్దరినీ రక్షించి ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సంఘటనలో 40 శాతం కాలిన గాయాలైన రుక్మిణి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. చంద్రకాంత్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. సొంత తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోయిన రుక్మిణి రెండు నెలల గర్భిణి కూడా విశేషం. తండ్రితో తల్లి అవుతున్న విషయాన్ని చెబితే సంతోషిస్తాడని భావించిన ఆమె... అతని చేతిల్లోనే ప్రాణాలు కోల్పోతానని ఊహించలేకపోయింది.

First published:

Tags: Crime, Honor Killing, Murder

ఉత్తమ కథలు