హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఉప ముఖ్యమంత్రి భార్య ఫేస్ బుక్ పేజీలో అసభ్యకర పోస్ట్ లు.. అధికారులకు చుక్కలు చూపించిన మహిళ..

ఉప ముఖ్యమంత్రి భార్య ఫేస్ బుక్ పేజీలో అసభ్యకర పోస్ట్ లు.. అధికారులకు చుక్కలు చూపించిన మహిళ..

పంకజ్ (ఫైల్)

పంకజ్ (ఫైల్)

Maharashtra: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య ఫేస్ బుక్ పేజీలో మహిళ కొన్నిరోజులుగా అసభ్యకర వ్యాఖ్యలను పోస్ట్ చేస్తోంది. దీంతో ఆమె సీరియస్ అయ్యారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Maharashtra, India

ప్రస్తుతం అందరి సామాజికి మాధ్యమాలను విపరీతంగా వినియోగిస్తున్నారు. ట్విటర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లను తెగవాడేస్తున్నారు. తమకు ఏమనిపించిన, ఎలాంటి విషయాలపై అయిన వెంటనే సోషల్ మీడియాలో (Social media) పోస్ట్ చేస్తున్నారు. అయితే.. కొందరు సైబర్ నేరగాళ్లు నకిలీ ఖాతాలు ఓపెన్ చేసి అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. అంతే కాకుండా.. కొన్నిసార్లు అసభ్య పోస్ట్ లు, అశ్లీల చిత్రాలను కూడా పోస్ట్ చేస్తు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. మహారాష్ట్ర (Maharashtra) ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnaviss)  భార్య అమృతా ఫడ్నవీస్ ఫేస్ బుక్ లో వేధింపులకు గురయ్యారు. గుర్తుతెలియని మహిళ ఆమెకు రిక్వెస్ట్ పెట్టింది. దీన్ని యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి సీఎం వాల్ మీద.. ఇష్టమోచ్చినట్లు కామెంట్ లు పెడుతుంది. అంతే కాకుండా.. అనుచిత వ్యాఖ్యలు, అసభ్య కంటెంట్ ఉన్న పోస్ట్ లు పెడుతుంది.

దీనితో ఆమె సీరియస్ గా తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళలను పంచల్ (50) అనే మహిళను అరెస్ట్ చేశారు. ఆమె అనేక నకిలీ ఖాతాలను క్రియేట్ చేసి, ఇలా వేధిస్తుందని అధికారులు గుర్తించారు. ఈ విధంగా దాదాపు.. 53 నకిలీ ఫేస్ బుక్ ఐడీలు, 13 జీమెయిల్ లను క్రియేట్ చేసిందని పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు ఆమెను అదుపులోనికి తీసుకుని, విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా క్లాస్ లో పిల్లల అల్లరికి విసిగిపోయి టీచర్ అలిగింది.

ఒక స్కూల్ లో బాలుడు రోజు అల్లరి చేస్తున్నాడు. క్లాసులో అందరి కన్నా అతడే చాలా రచ్చ చేస్తున్నాడు. అతనికి టీచర్ ఎన్నోసార్లు చెప్పిచూసింది. బాలుడికి చెప్పినప్పుడు అల్లరి చేయనని ముద్దుగా చెబుతుంటాడు. కానీ ఆ తర్వాత... కథ మళ్లీ మాములే.. ఈ విధంగా ప్రతిసారి అతనికి చెప్పడం.. మరల బుడ్డోడు అల్లరి చేయడం రోటీన్ గా మారిపోయింది. ఈ క్రమంలో విసిగిపోయిన క్లాస్ టీచర్ తరగతిలోనే అలిగి కూర్చుంది. దీన్ని గమనించిన పిల్లాడు.. టీచర్ దగ్గరకు వచ్చాడు.

‘టీచర్ దగ్గరకు వెళ్లి మళ్లి అల్లరిచేయనని క్యూట్ గా చెప్పాడు.’.. దీనికి టీచర్ “ఆప్ బార్ బార్ బోల్తే హో నహీ కరుంగా, నహీ కరుంగా, ఫిర్ కర్తే హో అని పదే పదే చెప్పడం కనిపిస్తుంది. మి ఆప్ సే బాత్ నహీ కరుంగి.” (నువ్వు పదే పదే చెపుతున్నావు, అయినా చేస్తావు. నేను నీతో మాట్లాడను. ఇంకోసారి చేయనని ఒకసారి చెప్పావు కానీ నువ్వు చేశావు) అని అతడితో మాట్లాడింది. కానీ చివరకు అతను ఈ సారి లాస్ట్.. ఇక నుంచి అల్లరిచేయనని చెబుతూ టీచర్ ను ప్రేమతో దగ్గరకు తీసుకుని, ముద్దులు కూడా పెట్టాడు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Maharashtra

ఉత్తమ కథలు