హోమ్ /వార్తలు /క్రైమ్ /

Girl Suicide: టీనేజ్ యువతి ఆత్మహత్య.. అయ్యో.. ఇంత చిన్న రిజన్ కేనా..?

Girl Suicide: టీనేజ్ యువతి ఆత్మహత్య.. అయ్యో.. ఇంత చిన్న రిజన్ కేనా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Maharashtra: టీనేజ్ యువతికి ఇంట్లో వారు ఫోన్ కొనిచ్చారు. ఎక్కువ సమయం ఫోన్ లోనే గంటల కొద్ది గడుపుతుంది. దీంతో ఆమె అన్నయ్య పద్ధతి మార్చుకొవాలని చెప్పాడు.

ఇప్పటి జనరేషన్ చిన్న చిన్న విషయాలకే చాలా ఒత్తిడికి గురౌతున్నారు. తమకు ఫ్రీడమ్ ఇవ్వాట్లేదంటూ ఇంట్లో వారిమీద కోపం పెంచుకుంటున్నారు. ప్రతి దానికి క్వశ్చన్ చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. దీంతో చిన్న విషయాలకు సూసైడ్ వరకు వెళ్తున్నారు. కొందరు కొత్త బట్టలు కొనివ్వలేదని, బైక్ కొనలేదని, ప్రియురాలు ప్రేమను రిజక్ట్ చేసిందని సిల్లి రిజన్స్ తో నూరేళ్ల జీవితాలను అర్థంతరంగా ముగించేస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. మహారాష్ట్రలోని (maharashtra) థానెలో దారుణం జరిగింది. 18 ఏళ్ల టీనేజ్ యువతికి (Teenage girl suicide) ఆమె కుటుంబ సభ్యులు మొబైల్ ఫోన్ (mobile phone)  కొనిచ్చారు. ఈ క్రమంలో..ఆమె ఎక్కువ సమయం ఫోన్ లోనే గడుపుతుంది. ఆమెను ఎన్నోసార్లు కుటుంబ సభ్యులు వారించారు. చదువు మీద శ్రద్ధకూడా తక్కువ అయ్యింది. దీంతో ఆమె సోదరుడు ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. అయిన ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇక లాభం లేదని సోదరి,సెల్ ఫోన్ లోని సిమ్ కార్డు తొలగించాడు.

దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో బెడ్ రూమ్ కు వెళ్లింది. ఆ తర్వాత..ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంత సేపటికి బాలిక డోర్ తెరవకపోవడంతో కిటికి నుంచి ఆమె కుటుంబ సభ్యులు చూశారు. బాలిక ఉరికి వేలాడుతు కన్పించింది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అనుమానస్పదంగా బాలిక చనిపోయిందని కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా రాజస్థాన్ లో ఒక బాలిక పై అత్యాచార ఘటన జరిగింది.

రాజస్థాన్ లో (Rajasthan) దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఈ ఘటన మే 16 న జరిగింది. బర్మన్ పట్టణంలో ఈ ఉదంతం జరిగింది. 14 ఏళ్ల బాలిక ఆరోగ్యం బాగాలేకపోవడంతో తన సోదరుడితో కలిసి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఎక్కువ మంది ఉండటంతో తమ వంతు కోసం వెచిచూస్తున్నారు. ఈక్రమంలో ఏవో సామాను కొనేందుకు బాలికను అక్కడే కూర్చోబెట్టి ఆమె సోదరుడు సూపర్ మార్కెట్ వెళ్లాడు. అప్పుడు ఆమెపై నసీర్ ఖాన్ అనే బాలుడు కన్నేశాడు. బాలిక దగ్గరకు వెళ్లి డాక్టర్ పిలుస్తున్నారంటూ చెప్పాడు. డెలివరీ రూమ్ కు తీసుకెళ్లి కత్తితో బెదిరించి అత్యాచారం (Rape on girl)  చేశాడు. దారుణాన్ని వీడియో తీశాడు. ఎవరికైన చెబితే దీన్ని బయటపెడుతానని బెదిరించాడు.

దీంతో బాధితురాలు తీవ్ర భయంతో వణికిపోయింది. ఇంటికి వచ్చాక కూడా బాలిక ప్రవర్తనలో తేడా ఉండటంతో ఇంట్లో వారు ఆమెను ఏమైందని అడిగారు. దీంతో బాలిక జరిగిన దారుణాన్ని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు మే 19 న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులకు నసీర్ ఖాన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, నిందితుడు గతంలో తమ ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువును రిపేర్ చేసేందుకు వచ్చాడు. అప్పటి నుంచి అతడు ఆమెను వెంబడిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడిని గాలించడానికి ప్రత్యేకంగా పోలీసులు రంగంలోనికి దిగారు

First published:

Tags: Maharashtra, Mobile phone, Suicide hanging

ఉత్తమ కథలు