హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఒకేసారి తొమ్మిది మంది ఆత్మహత్య కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి.. 13 మంది అరెస్టు..

ఒకేసారి తొమ్మిది మంది ఆత్మహత్య కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి.. 13 మంది అరెస్టు..

మృతులు (ఫైల్)

మృతులు (ఫైల్)

Maharashtra: మహారాష్ట్ర సాంగ్లీలోని మైసల్ పట్టణంలో జరిగిన సాముహిక ఆత్మహత్య కేసులో.. 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

దేశంలో సంచలనంగా మారిన సాముహిక ఆత్మహత్యల ఘటన సోమవారం మహారాష్ట్రలో (Maharashtra)  జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందన 9 మంది సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఆ గ్రామం ఉలిక్కి పడింది. సాంగ్లీ ఘటన(Sangli mass  suicide) దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. 24 గంటలలోనే ఈ ఘటనకు కారణమైన వారిలో 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు... మరో 25 మందిపై కేసులను నమోదు చేశామని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

చనిపోయిన వారు.. వీరి (Mass suicide) నుంచి డబ్బులు తీసుకున్నారని, ఆ తర్వాత.. వీరి వడ్డీల ఒత్తిడి భరించలేక దారుణానికి ఒడిగట్టారని పోలీసుల విచారణలో తెలింది. కాగా, నిన్న (సోమవారం) చనిపోయిన వారిలో.. ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన తొమ్మిది మంది వేర్వేరు చోట్ల తమ ఇళ్లలో విషం సేవించారు. మృతులలో.. వృత్తి రీత్యా వెటర్నరీ డాక్టర్ పోపట్ యల్లప్ప వాన్‌మోర్ (52), సంగీతా పోపట్ వాన్‌మోర్ (48), అర్చన పోపట్ వాన్‌మోర్ (30), శుభం పోపట్ వాన్‌మోర్ (28), మానిక్ యల్లప్ప వాన్‌మోర్ (49), రేఖ మాణిక్‌లుగా పోలీసులు గుర్తించారు. వాన్మోర్ (45) మరియు ఆదిత్య మానిక్ వాన్ (15), అనితా మానిక్ వాన్మోర్ (28), అక్కాటై వాన్మోర్ (72) తదితరులు ఉన్నారు.

ఘటనపై పూర్తి వివరాలు..

మహారాష్ట్రలోని మైసల్ పట్టణంలో ఊహించని దారుణం చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో ఏకంగా 9 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. సంగ్లీ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు(Police) అనుమానిస్తున్నారు. చనిపోయిన వారి శరీరాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో విషప్రయోగమే వీరి మరణానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వీరంతా ఆత్మహత్యకు(Suicide) పాల్పడి ఉండొచ్చని చెబుతున్నారు. మొత్తం 9 మృతదేహాల్లో(Nine Dead Bodies) ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. వీరంతా విషం తాగడం వల్లే చనిపోయారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ఈ కుటుంబం డాక్టర్ కుటుంబం అని తెలుస్తోంది.

మాణిక్ వాన్‌మోర్ ఇంట్లో నుంచి సోమవారం మధ్యాహ్నం ఈ మృతదేహాలను కనిపెట్టినట్టు పోలీసులు తెలిపారు. వాన్‌మోర్ ఈ ప్రాంతంలో మెడికల్ ప్రాక్టీసు చేస్తున్నట్టు పోలీసులకు అందిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే చనిపోయిన వారిలో ఆయన ఉన్నారా లేదా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే సంగ్లీ జిల్లాకు చెందిన సీనియర్ పోలీసు అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

కొల్లాపూర్ రేంజ్ స్పెషల్ ఇన్స్‌పెక్టర్ జనరల్ మనోజ్ కుమార్ లోహియా ఈ ఘటనపై స్పందించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని అన్నారు. ఈ మరణాలకు విషప్రయోగమే కారణమని అనుమానం వ్యక్తం చేశారు

First published:

Tags: Crime news, Family suicide, Maharashtra

ఉత్తమ కథలు