Home /News /crime /

MAHARASHTRA ROADWAYS BUS FALLS INTO NARMADA RIVER IN DHAR DISTRICT 12 DEAD AND 15 RESCUED PVN

Buss Falls Into River : వంతెనపై అదుపుతప్పి నదిలో పడ్డ బస్సు..12మంది మృతి,పలువురు గల్లంతు

నదిలొ పడ్డ బస్సు

నదిలొ పడ్డ బస్సు

Bus Accident : మధ్యప్రదేశ్(Madhyapradesh)​లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం ఇండోర్ నుంచి పూణేకి ప్రయాణికులతో వెళ్తోన్న మహారాష్ట్ర రోడ్‌వేస్ బస్సు(Maharashtra Roadways Bus) ధార్ జిల్లా ఖాల్​ఘాట్​ వద్ద సంజయ్ సేతు వంతెనపై వెళ్తోన్న సమయంలో అదుపు తప్పి నర్మదా నదిలో(Narmada River) పడిపోయింది.

ఇంకా చదవండి ...
    Buss Falls Into River : మధ్యప్రదేశ్(Madhyapradesh)​లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం ఇండోర్ నుంచి పూణేకి ప్రయాణికులతో వెళ్తోన్న మహారాష్ట్ర రోడ్‌వేస్ బస్సు(Maharashtra Roadways Bus) ధార్ జిల్లా ఖాల్​ఘాట్​ వద్ద సంజయ్ సేతు వంతెనపై వెళ్తోన్న సమయంలో అదుపు తప్పి నర్మదా నదిలో(Narmada River) పడిపోయింది. వంతెన గోడను ఢీకొని సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి బస్సు నదిలోకి పడిపోయినట్లు సమాచారం.

    సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ఘటనాస్థలికి చేరుకుంది. బస్సు నదిలోకి దూసుకెళ్లిన ఘటనలో 12 మంది మరణించారు. మరో 15 మందిని సహాయ బృందాలు రక్షించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం. ప్రమాదం అనంతరం పలువురు ప్రయాణికులు నీటిలో గల్లంతు కాగా, మరికొందరు బస్సులోనే ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచారు. మిగతావారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.



    బస్సు లోయలో పడిన సమాచారం అందిన వెంటనే సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. సంఘటన స్థలానికి అవసరమైన వనరులను పంపాలని, గాయపడిన వారికి సరైన చికిత్స కోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక, క్రేన్ సాయంతో నదిలో పడ్డ బస్సును బయటకు తీశారు.

    AFS : మరో కొత్త ప్రాణాంతక వైరస్..అసోంలో కేసు నమోదు..పందులని చంపేస్తున్న ప్రభుత్వాలు

    మరోవైపు,శుక్రవారం తెల్లవారుజామున, ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లోని రాజ్‌పూర్ ప్రాంతంలో ప్రైవేట్ బస్సు బోల్తా పడి కాలువలో పడిపోవడంతో ఒక ప్రయాణికుడు మరణించగా, 30 మంది గాయపడ్డారు. కుసైలి గ్రామ సమీపంలోని మలుపు వద్ద బస్సు బోల్తా పడి కాలువలో పడిపోయిందని ఆ ప్రాంత సర్కిల్ ఆఫీసర్ (సిఓ) శివప్రకాష్ సోంకర్ తెలిపారు. గాయపడిన 30 మందిని ఆసుపత్రికి తరలించగా, ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
    Published by:Venkaiah Naidu
    First published:

    Tags: Bus acident, Died, Madhyapradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు