హోమ్ /వార్తలు /క్రైమ్ /

పబ్లిక్ లో రోడ్డుమీద నగ్నంగా స్నానం చేయాలంటూ... కోడలికి వేధింపులు.. కారణం ఏంటంటే..

పబ్లిక్ లో రోడ్డుమీద నగ్నంగా స్నానం చేయాలంటూ... కోడలికి వేధింపులు.. కారణం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Maharashtra: మహిళకు మగ సంతానం లేదు. దీంతో అత్తంటి వారు తరచుగా వేధిస్తుండేవారు. అంతటితో ఆగకుండా ఈ మధ్యనే తాంత్రికుడిని కలిశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Maharashtra, India

కొందరు అత్తింటి కోడలి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. ఆమెను సుటీపోటి మాటలతో మానసికంగా వేధిస్తుంటారు. మరికొందరు.. ఆ పనిచేయలేదు.. ఇది చేయలదంటూ నోటికొచ్చినట్లు తిడుతుంటారు. మరికొందరు తరచుగా గొడవలకు దిగుతుంటారు. కొందరికి పిల్లలు పుట్టలేదని, అది కూడా మగ సంతానం కల్గలేదని తరచుగా కోడలిపై దాడులు చేస్తుంటారు. పిల్లల కోసం ఆస్పత్రుల చుట్టు తిరుగుతుంటే.. ఇంకొందరు మాంత్రికులను కలుస్తుంటారు. వారు చెప్పే అడ్డమైన పనులు చేస్తుంటారు. కొందరు మాంత్రికులు తమ దగ్గరకు వచ్చిన వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని, మహిళలను వేధిస్తుంటారు. వీరి మాటలను విని ఇంట్లోవారు, కోడలిని వేధింపులకు గురిచేస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు.. మహారాష్ట్రలోని (Maharashtra) పూణెలో షాకింగ్ ఘటన జరిగింది. 2013 లో మహిళకు ఒక నగల వ్యాపారితో పెళ్లయ్యింది. కొన్నిరోజుల పాటు బాగానేఉన్న ఆ తర్వాత నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. తన భర్త బంగారు ఆభరణాలను విక్రయించి, తన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని బ్యాంకులో తనఖా పెట్టి ₹ 75 లక్షల రుణం తీసుకున్నాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అప్పు కోసం తన భర్త తన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశాడని మహిళ ఆరోపించింది.తన భర్తకు కొల్హాపూర్‌కు చెందిన ఒక క్షుద్రశాస్త్రవేత్తతో పరిచయం కలిగిందని, ఆమె "వ్యాపారంలో లాభాలు" కోసం కొన్ని వింత వింత పనులు చేస్తుండేవాడని తెలిపింది. కాగా, క్షుద్ర మాంత్రికుడు అయిన మౌలానా బాబా జమాదార్, ఆమె "మగ బిడ్డను కనేందుకు" ఆమెను పూర్తిగా ప్రజల దృష్టిలో జలపాతం కింద స్నానం చేయాలని చెప్పాడు. ఇలా చేస్తే వెంటనే మగ సంతానం కల్గుతారని అతనికి తెలిపాడు. దీంతో  రాయగఢ్‌కు తీసుకువెళ్లాలని మహిళ భర్తను, అత్తమామలు కోరినట్లు ఆమె తెలిపింది. దీంతో వారు నగ్నంగా స్నానం చేయాలని ఆమెను వేధించారు.దీంతో విసిగిపోయిన ఆమె పూణెలోని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భర్త, అత్తమామలు, క్షుద్ర మాంత్రికుడు సహా నలుగురిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.


ఇదిలా ఉండగా దొంగ, పోలీసులకు ఒక రేంజ్ లో చుక్కలు చూపించాడు.


పూర్తి వివరాలు.. ఒక దొంగను పోలీసులు జీప్ లో ఛేజింగ్ చేస్తున్నారు. అతను స్కూటీపై ధూమ్ స్టైల్ లో చక్మా ఇచ్చాడు. అంతే కాకుండా.. పోలీసులకు దొరక్కుండా స్కూటీ మీద కట్స్ కొడుతూ ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు అతగాడు ఒక వంపు మార్గం రాగానే దానిలోపలికి పొనిచ్చాడు. అప్పుడు.. దిమ్మ తిరిగే ఘటన జరిగింది. స్కూటీ మీద ప్రయాణిస్తున్న దొంగ.. మరో మార్గంలోనికి పొనిచ్చాడు. అప్పుడు.. అతనికి ఎదురుగా ఒక సుమో వాహనం ఆగి ఉంది.


అతను వేగంగా వెళ్లి.. వెహికిల్ వెనుక నుంచి యూటర్న్ చేసుకుని వచ్చిన మార్గం గుండా తిరిగి వెళ్లిపోయాడు. పాపం.. పోలీసులు స్కూటీ అంత వేగంగా తమ వాహనం టర్న్ చేయలేక అక్కడే ఉండిపోయారు. అంతే కాకుండా.. పోలీసులు వెహికిల్ దిగి.. అతగాడి కోసం వెనుకవైపుకు వచ్చి మరీ చూశారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు (Netizens) ఇదేం తెలివిరా నాయన అంటూ కామెంట్ లు పెడుతున్నారు. మరికొందరు వీడిది మాములు బుర్రకాదంటూ నవ్వుతూ ఎమోజీలను పెడుతున్నారు.


Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Maharashtra

ఉత్తమ కథలు