MAHARASHTRA POLICE HAVE ARRESTED AN 18 YEAR OLD YOUTH AND HIS MOTHER FOR ALLEGEDLY HACKING OFF HIS ELDER SISTER HEAD WITH A SICKLE SSR
Shocking Incident: ఇలాంటి ఘటన గురించి మీరెప్పుడూ విని ఉండరు.. చూసి ఉండరు.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన..
బాధితురాలు, ఆమె తమ్ముడు సంకేత్
మహారాష్ట్రలో 19 ఏళ్ల యువతి పరువు హత్య కలకలం రేపింది. ఈ హత్య జరిగిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. సొంత తమ్ముడే అక్క తల నరికి.. ఆ నరికిన తలతో సెల్ఫీ దిగి అతని స్నేహితులకు పంపిన ఘటన మహారాష్ట్రను ఉలిక్కిపడేలా చేసింది.
ఔరంగాబాద్: మహారాష్ట్రలో 19 ఏళ్ల యువతి పరువు హత్య కలకలం రేపింది. ఈ హత్య జరిగిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. సొంత తమ్ముడే అక్క తల నరికి.. ఆ నరికిన తలతో సెల్ఫీ దిగి అతని స్నేహితులకు పంపిన ఘటన మహారాష్ట్రను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన ఔరంగాబాద్ పరిధిలోని వైజాపూర్ తాలూకాలో ఉన్న గోయిగావ్ అనే గ్రామంలో చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గోయిగ్రావ్ గ్రామానికి చెందిన శోభా ఎస్.మోతే అనే 40 ఏళ్ల మహిళకు 19 ఏళ్ల వయసున్న క్రితి అనే కూతురు, 18 ఏళ్ల వయసున్న సంకేత్ ఎస్.మోతె అనే కొడుకు ఉన్నారు. శోభ భర్త లేడు. అదే గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడు, క్రితి ప్రేమించుకున్నారు. కొన్నేళ్ల నుంచి వారిద్దరూ ఇరు కుటుంబాలకు తెలియకుండా కలుసుకునేవారు. ఇలా ఉన్న ఈ జంట జూన్ 21న పెద్దలకు తెలియకుండా ఇంట్లో నుంచి పుణె జిల్లాలోని అలండి పట్టణానికి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. కూతురు వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనైన శోభ అక్క పరువు తీసి ఇలా వెళ్లిపోయిందని సంకేత్‌కు చెప్పుకుని బాధపడేది.
కూతురు చేసిన పనివల్ల పరువు పోయిందని ఆమెపై కక్ష పెంచుకున్న శోభ కన్నపేగు బంధాన్ని మరిచింది. కూతురిని చంపాలని నిర్ణయించుకుంది. అయితే.. ఆమెను నమ్మించి చంపాలని భావించి.. ప్రేమ పెళ్లి చేసుకుని ఊరికి దూరంగా ఉంటూ వాళ్ల బతుకు వాళ్లు బతుకుతున్న కూతురు మళ్లీ తమ ఊరికి వచ్చి భర్తతో కలిసి ఉంటున్న విషయం శోభకు తెలిసింది. వెంటనే కూతురికి ఫోన్ చేసింది. తల్లి ఫోన్ చేయడంతో క్రితి ఎంతో సంతోషించింది. జరిగిందేదో జరిగిపోయింది. చూడాలని ఉందమ్మా.. మీ ఇంటికి వస్తానని కూతురికి చెప్పింది. తల్లి పిలిచేసరికి తప్పకుండా రమ్మని చెప్పింది. వారం క్రితం కొడుకును వెంటబెట్టుకుని అల్లుడి ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత క్రితి, ఆమె భర్త కూడా శోభ ఇంటికి వెళ్లారు. అంతా బాగుందని భావించిన క్రితికి ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. డిసెంబర్ 5న ఆదివారం కొడుకు సంకేత్‌తో కలిసి కూతురు ఇంటికి శోభ మళ్లీ వెళ్లింది. ఆ సమయంలో అత్తతో కలిసి క్రితి ఇంటికి దగ్గర్లో ఉన్న పొలంలో పనిచేస్తోంది. అమ్మ, తమ్ముడు ఇంటికి రావడం చూసిన క్రితి ఎంతో సంతోషించింది.
ఇద్దరిని ఇంట్లోకి పిలిచి మంచినీళ్లు ఇచ్చి టీ పెట్టుకుని తీసుకొస్తానమ్మా అని వంటగదిలోకి వెళ్లింది. ఆ సమయంలో క్రితి భర్తకు ఆరోగ్యం బాగోలేక పోవడంతో మరో గదిలో విశ్రాంతి తీసుకుంటూ నిద్రిస్తున్నాడు. క్రితి తన తల్లి, సోదరుడి కోసం టీ చేస్తూ వంటగదిలో ఉండగా వెనుక నుంచి తల్లి శోభ కూతురు కాళ్లు పట్టుకుని కిందపడేసింది. శోభ కొడుకు, క్రితి తమ్ముడు సంకేత్ కొడవలితో సొంత అక్క అనే కనికరం కూడా లేకుండా పరువు పిచ్చిలో ఆమె గొంతు కోశాడు. మొండెం నుంచి తలను వేరు చేశాడు. అంతేకాదు.. సోదరి తలను చేత్తో పట్టుకుని ఏదో గొప్ప చేసినట్టు ఆమె తలతో సెల్ఫీలు దిగాడు. పిచ్చివాడిలా చిందులేసుకుంటూ బయటకు వెళ్లి ఆమె తలను అందరికీ చూపించాడు.
ఇరుగుపొరుగు వాళ్లకు క్రితి తలను అలా చూసి గుండె ఆగినంత పనయింది. ఈలోపు ఏదో అలికిడి అయినట్లు అనిపించడంతో క్రితి భర్త బయటకు వచ్చి చూస్తే భార్య తల అతని బావమరిది చేతిలో చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. క్రితి భర్త అజయ్‌ను చూసిన సంకేత్ అతనిని కూడా చంపాలని ప్రయత్నించాడు. అయితే.. అజయ్ తప్పించుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ హత్య కేసులో నేరస్తులైన శోభను, ఆమె కొడుకును అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఔరంగాబాద్ జిల్లాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.