MAHARASHTRA MINISTER CHAGAN BHUJBAL ON MUMBAI DRUGS CASE SAYS DRUGS WILL BE LIKE SUGAR IF THE STAR HERO JOINS BJP PRV
Mumbai drugs case: ఒకవేళ ఆ బాలీవుడ్ స్టార్ హీరో బీజేపీలో చేరితే డ్రగ్స్ పంచదారలా దొరుకుతుందంటూ... మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఛగన్ భుజబల్
డ్రగ్స్ కేసు ఇప్పుడు బాలీవుడ్ (Bollywood)ని షేక్ చేస్తోంది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్‌కు (Aryan khan) బెయిల్ (bail) రావడం లేదు. ఆర్యన్ ఖాన్ (Aryan khan)కు వ్యతిరేకంగా బలమైన ఆధారాలున్నాయని, బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని ముంబైలోని స్పెషల్ కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి ఛగన్ భుజబల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఒకవేళ బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) బీజేపీలో చేరినట్లైతే డ్రగ్స్ పంచదార పౌడర్ (sugar powder) అవుతుందని బీజేపీపై (BJP) తీవ్ర స్థాయిలో మండి పడ్డారు మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఛగన్ భుజబల్. అయితే గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌లో 3,000 కిలోల డ్రగ్స్ దొరికిన విషయాన్ని ఛగన్ ప్రస్తావిస్తూ క్రూజ్ షిప్‌పైనే.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఎందుకు దృష్టి పెట్టిందని ప్రశ్నించారు. బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్‌లో డ్రగ్స్ (drugs) దొరికిన కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆ డ్రగ్స్ కేసు ఇప్పుడు బాలీవుడ్ (Bollywood)ని షేక్ చేస్తోంది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్‌కు (Aryan khan) బెయిల్ (bail) రావడం లేదు. ఆర్యన్ ఖాన్ (Aryan khan)కు వ్యతిరేకంగా బలమైన ఆధారాలున్నాయని, బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని ముంబైలోని స్పెషల్ కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి ఛగన్ భుజబల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఆ డ్రగ్స్ కేసు ఏమైంది..?
దేశంలో వందల, వేల కిలోల డ్రగ్స్ (drugs) బయటపడుతున్నాయని ఎన్సీపీ మంత్రి ఛగన్ భుజబల్ వ్యఖ్యానించారు. కొద్దిరోజుల కిందటే గుజరాత్ (Gujarat)లోని ముంద్రా పోర్ట్‌లో 3,000 కిలోల డ్రగ్స్ సీజ్ చేశారని ఛగన్ భుజబల్ (Chhagan Bhujbal) తెలిపారు. అయితే ఎన్సీబీ ఒక్క ముంబై (Mumbai)నే టార్గెట్ చేసిందని తప్పుబట్టారు. క్రూజ్ షిప్లో దొరికిన డ్రగ్స్ చాలా తక్కువ అని ఛగన్ భుజబల్ అన్నారు. కేవలం దీనిపైనే దృష్టి సారించడం కక్షపూరితమే అని ఆయన అన్నారు. ఒకవేళ షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) బీజేపీలో చేరితే ముంబైలోని డ్రగ్స్ మొత్తం పంచదార పౌడర్ (sugar powder) అయిపోతుందన్నారు.
కేసు నేపథ్యం..
ఇటీవల ముంబై కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఆ ప్రయాణికుల ఓడలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు అర్ధరాత్రి దాడులు జరిపారు. ఈ రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేశారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడే ఎన్సీబీ అధికారులకు అధిక మొత్తంలో కొకైన్ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు.
బెయిల్ లభిస్తుందని అనుకున్నా..
ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. విచారణలో ఉన్న ఆర్యన్ ఖాన్‌కు త్వరగానే బెయిల్ లభిస్తుందని అంతా భావించారు. ఆర్యన్‌కు బెయిల్‌ను నిరాకరించిన న్యాయస్థానం.. అతనికి అక్టోబర్ 7వ తేదీ వరకూ కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.