రూ.40వేలు తిరిగిచ్చిన వ్యక్తికి.. రూ.5లక్షల బహుమానం.. కానీ,

జగ్దాలేకి బస్టాండ్‌లో రూ.40వేలు దొరికినప్పుడు అతడి జేబులో కేవలం రూ.3 మాత్రమే ఉన్నాయట.

news18-telugu
Updated: November 4, 2019, 3:08 PM IST
రూ.40వేలు తిరిగిచ్చిన వ్యక్తికి.. రూ.5లక్షల బహుమానం.. కానీ,
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇది కలికాలం. మోసమే గెలుస్తుంది. నీతి, నిజాయితీలు చచ్చిపోయాయని అప్పుడప్పుడు ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతూ ఉంటారు. అయితే, మంచితనం చనిపోలేదు. సమయానికి అనుకూలంగా బయటపడుతుందనే విషయం ఈ ఘటనను చూస్తే తెలుస్తుంది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 54 ఏళ్ల జగ్దాలే.. ఓ రోజు బస్టాండ్‌లో నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో అతడికి ఓ బ్యాగ్ కనిపించింది. ఆ బ్యాగ్‌ తెరిచి చూస్తే.. అందులో డబ్బుల కట్టలు ఉన్నాయి. ఆ బ్యాగ్ తీసుకున్న జగ్దాలే.. ఆ చుట్టుపక్కల వారిని అడిగాడు. కానీ, వారెవరూ ఆ బ్యాగ్ తమది కాదని చెప్పారు. అంతలో ఓ వ్యక్తి ఏదో పోగొట్టుకుంటున్నట్టు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో వెతకడం చూసి.. అతడిని అడిగితే.. తన డబ్బు పోయిందని చెప్పాడు. తన వద్ద ఉన్న బ్యాగ్‌ను తీసి చూపించగా, ఆ డబ్బు తనదేనని చెప్పాడు. తన భార్య ఆపరేషన్ కోసం ఆ డబ్బు జమచేసుకున్నానని, అవి బస్టాండ్‌లో పొరపాటున మర్చిపోయానని చెప్పాడు.

దీపావళి రోజు వారింట్లో నిజంగానే దీపాలు వెలిగించాడు జగ్దాలే. అతడి మంచితనానికి ముచ్చటేసి... ఆ డబ్బు యజమాని జగ్దాలేకి రూ.1000 ఇవ్వబోయాడు. కానీ, ఆ బహుమానాన్ని అతడు తిరస్కరించాడు. తన సొంతూరు వెళ్లడానికి ఓ రూ.7 మాత్రమే తీసుకున్నాడు.

జగ్దాలే మంచితనాన్ని చూసి.. సతారా ఎమ్మెల్యే శివానందరాజే భోసాలే, ఇతర స్వచ్ఛంద సంస్థలు అతడిని సత్కరించాయి. కానీ, వారి వద్ద అతడు ఒక్క రూపాయి కూడా బహుమానంగా తీసుకోలేదు.

అంత మంది అన్ని రకాలుగా డబ్బులు ఇస్తున్నా.. వద్దంటున్న అతడి మంచితనాన్ని చూసి ముగ్ధుడయిన రాహుల్ బార్గే అనే ఓ ఎన్ఆర్ఐ.. అతడికి ఏకంగా రూ.5లక్షలు ఇస్తానని ముందుకొచ్చాడు. కానీ, ఆ డబ్బులు కూడా తనకు వద్దని చెప్పాడు జగ్దాలే.జగ్దాలేకి బస్టాండ్‌లో రూ.40వేలు దొరికినప్పుడు అతడి జేబులో కేవలం రూ.3 మాత్రమే ఉన్నాయట. సొంతూరు వెళ్లడానికి బస్ టికెట్ డబ్బులు రూ.7 మాత్రమే తీసుకోవడం విశేషం.

జగన్ పేరుతో భవన నిర్మాణ కార్మికుల వద్ద వసూళ్ల దందా

First published: November 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>