హోమ్ /వార్తలు /క్రైమ్ /

మహారాష్ట్రలో దారుణం...మరో ప్రణయ్ పరువు హత్య

మహారాష్ట్రలో దారుణం...మరో ప్రణయ్ పరువు హత్య

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కాలేజీని పరీక్ష రాసి భార్యభర్తలు బయటకు వచ్చిన వెంటనే ఇద్దరు దుండగులు భర్తపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. పట్టపగలే జరిగిన ఈ దారుణ హత్య...పరువు హత్యగా పోలీసులు భావిస్తున్నారు.

  దేశంలో ఎక్కడో ఒకచోట పరువు హత్యలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. మిర్యాలగూడలో ప్రణయ్ హత్యోదంతం తరహాలోనే తాజాగా మహారాష్ట్రలో ఓ వ్యక్తి పరువు హత్యకు గురైయ్యాడు. తన క్లాస్‌మేట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న 25 ఏళ్ల సుమిత్ శివాజీరావు బీద్ నగరంలోని ఓ కాలేజీ ఎదుట దుండగులు నరికిచంపారు. అమ్మాయి కుటుంబానికి ఇష్టం లేకున్నా ఆమెను రెండు మాసాల క్రితం పెళ్లి చేసుకున్నందుకు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనతో బీద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

  బీద్‌లోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో సుమిత్ శివాజీరావు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. అదే క్లాస్‌లోనే చదువుతున్న ఓ అమ్మాయి, సుమిత్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి ప్రేమను అమ్మాయి ఇంటివారు అంగీకరించలేదు. దీంతో రెండు మాసాల క్రితం వారిద్దరూ తమ ఇష్టం మేరకు పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం వారిద్దరూ కాలేజీలో పరీక్ష రాసి బయటకు వచ్చిన వెంటనే ఇద్దరు దుండగులు సుమిత్‌పై కత్తులతో దాడి చేశారు. పట్టపగలు జరిగిన జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురైయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న సుమిత్‌ను బీద్ సివిల్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇది పరువు హత్యేనని భావిస్తున్న పోలీసులు, కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.

  Published by:Janardhan V
  First published:

  Tags: Crime, Honor Killing

  ఉత్తమ కథలు