• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • MAHARASHTRA MAN KIDNAPPED SON OF HIS LIVE IN PARTNER AND ARRESTED WHILE IN TRAIN JOURNEY HSN

మహిళతో సహజీవనం.. ఆ ఒక్క దానికి ఆమె నో చెప్పిందని అతడు ఎంతకు తెగించాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఓ వ్యక్తి తనకు పరిచయం అయిన మహిళతో సహజీనవం చేస్తున్నాడు. ఆమెకు అప్పటికే ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. ఇటీవల ఓ విషయమై ఆమెను తరచూ అడుగుతున్నాడు. ఆమె నో చెబుతుండటంతో అతడికి కోపం వచ్చింది. చివరకు..

  • Share this:
    అదో రైలు.. వందలాది మంది ప్రయాణికులు ఆ రైల్లో జర్నీ చేస్తున్నారు. వారిలో ఓ 35 ఏళ్ల వ్యక్తి ఓ ఏడేళ్ల బాలుడితో కలిసి ప్రయాణిస్తున్నాడు. ఇంతలో కొందరు పోలీసులు ఆ రైల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రతీ ఒక్క బోగీని జల్లెడపడుతూ వచ్చారు. చివరకు ఆ 35ఏళ్ల వ్యక్తిని పట్టుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆ బాలుడిని తల్లికి అప్పగించారు. ఇది చదివితేనే అర్థమవుతోంది కదా ఆ బాలుడిని ఆ వ్యక్తి కిడ్నాప్ చేశాడని. అయితే ఆ బాలుడు ఎవరో కాదు స్వయానా అతడు సహజీవనం చేస్తున్న మహిళే కావడం గమనార్హం. మహారాష్ట్రలోని థానే జిల్లా పరిధిలో జరిగిందీ ఘటన. బాలుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు చాకచక్యంతో వ్యవహరించి ఆ బాలుడిని వెతికి పట్టుకున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

    మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ముంబ్రాలో 35 ఏళ్ల వయసున్న రింకూ సరోజ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సహజీవనం దాకా వెళ్లింది. ఇద్దరూ కలిసి కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే అప్పటికే ఆ మహిళకు ఓ ఏడేళ్ల వయసున్న బాలుడు ఉన్నాడు. ముగ్గురూ కలిసే ఓ ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా, కొద్ది నెలలుగా ఆ మహిళతో రింకూ ఓ విషయమై గొడవపడుతున్నాడు. ఇక్కడ ఉండటం బదులుగా ఉత్తర ప్రదేశ్ కు వెళ్దామనీ, అక్కడయితే పనులు ఎక్కువగా, కూలి ఎక్కువగా వస్తుందంటూ చెప్పసాగాడు.

    అయితే రింకూ మాటలను ఆ మహిళ వినలేదు. ’నేను మాత్రం ఇక్కడే ఉంటా. ఆ ఉత్తర ప్రదేశ్ కు రాను. కావాలంటే నువ్వు వెళ్లవచ్చు.‘ అని రింకూతో ఆ మహిళ తేల్చిచెప్పింది. దీంతో ఆగ్రహం చెందిన రింకూ, తాను సహజీవనం చేస్తున్న మహిళ కుమారుడితో కలిసి జనవరి 24న ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ఆ బాలుడిని తీసుకుని ఉత్తర ప్రదేశ్ రైలెక్కాడు. కొడుకు ఇంట్లో లేకపోవడం, రింకూ కూడా కనిపించకపోవడంతో ఆ మహిళకు అనుమానం వచ్చింది. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దగ్గరలోని బస్టాండ్, రైల్వే స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ప్రయాగరాజ్, ఇతర్సీల్లోని రైల్వే పోలీసులకు కూడా వారి గురించిన సమాచారం ఇచ్చారు. దీంతో ఆ పోలీసులు అప్రమత్తమై అతడు ప్రయాణిస్తున్న రైల్లోకి ఎక్కి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని తల్లికి అప్పగించారు. అతడిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
    Published by:Hasaan Kandula
    First published: