Home /News /crime /

MAHARASHTRA MAN DIES BY SUICIDE WROTE WIFE COULDNT DRAPE SAREE WELL PAH

Shocking:పెళ్లై ఆరునెలలు... భార్యకు చీర సరిగ్గా కట్టుకోవడం రాదని.. భర్త ఎంత పనిచేశాడు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Maharashtra: పెళ్లై ఆరునెలలు మాత్రమే అయ్యింది. భార్యకు చీర కూడా సరిగ్గా కట్టుకోవడం రాదని తెలిసి కుమిలిపోయాడు.

సమాజంలో కొంత యువత వింతగా ప్రవర్తిస్తున్నారు. చిన్న విషయాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంత మంది ఎగ్జామ్ పాస్ కాలేదని, ఇంట్లో వారు తిట్టారని ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొందరు ప్రేమించిన యువతి, ప్రేమను అంగీకరించలేదని సూసైడ్ చేసుకుంటున్నారు. ఇక కొందరైతే కొత్త బట్టలు కొనివ్వలేదని, సెల్ ఫోన్ కొనలేదని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో పెళ్లాం సరైన కూర వండలేదని, కూరలో ఉప్పు సరిగ్గా వేయలేదని సిల్లి రిజన్స్ తో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. మహారాష్ట్రలో (maharashtra) ఈ ఘటన జరిగింది. ఔరంగాబాద్ నగరంలో 24 ఏళ్ల వ్యక్తికి ఆరునెలల క్రితమే పెళ్లయ్యింది. అతని భార్య వయసులో అతని కన్న ఆరేళ్లు పెద్ద. అయితే, ఆమెకు సరిగ్గా మాటలు రావు. అదే విధంగా, చీర కట్టుకోవడం కూడా సరిగ్గా రాదు. నడవలేదు. ఇవన్ని దాచిపెట్టి తన జీవితం నాశనం చేశారని అతను కుమిలిపోయాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో తన గదిలో వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

భర్త ఎంతసేపటికి గది తలపులు తీయక పోవడంతో భార్య భయపడిపోయింది. వెంటనే ఇరుగు పోరుగు వారిని పిలిచింది. వారు తలుపు పగలగొట్టి చూడగా అతను దూలానికి వెళాడుతు కన్పించాడు. అక్కడే ఒక సూసైడ్ నోట్ కూడా రాశాడు. తన భార్యకు చీర కట్టుకొవడం రాదని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

కంటికి రెప్పలా కాపాడాల్సిన యువకులే తమ సోదరిని బెదిరించి (rape on girl) అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ దారుణం ముంబైలో  (mumbai) జరిగింది. ప్రభుత్వాలు మహిళలు, అమ్మాయిల భద్రత కోసం దిశ, పోక్సో, నిర్బయ, ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కామాంధులు మాత్రం మారడం లేదు. ప్రతి రోజు మహిళలపై అఘాయిత్యాలు, దారుణాల ఘటన వెలుగు చూస్తునే ఉన్నాయి. మహిళలు ప్రతి చోట వేధింపులకు గురౌతున్నారు. కొన్ని చోట్ల అత్యంత నీచంగా తెలిసిన వారే దారుణాలకు పాల్పడుతున్నారు. మరికొన్ని చోట్ల సొంత మనుషులే పశువు కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. తమ వారిపైనే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ముంబైలో (mumbai) ఈ అమానుషం జరిగింది. ధారవిలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. అనిల్ చౌహన్ , నీలేష్ లు ఇద్దరు తమ, సోదరిపై లైంగికంగా వేధించారు. ఆ తర్వాత.. ఆమెను ఇంట్లో ఎవరు లేనిది చూసి, కత్తితో బెదిరించి అత్యాచారం చేశారు. ఈ ఘటనను వీడియో కూడా తీశారు. ఆమెను బెదిరించారు. ఎవరికైన చెబితే చంపేస్తామంటూ హెచ్చరించారు.

దీంతో బాలిక భయపడిపోయి కొన్ని రోజులు దారుణం ఎవరికి చెప్పలేదు. బాలిక ప్రవర్తన అనుమానకరంగా ఉండటంతో ఆమెను తల్లిదండ్రులు అడిగారు. దీంతో తన బాధను చెప్పుకుంది. ఈ మేరకు ఘటన వెలుగులోనికి రావడంతో పోలీసుల వరకు వెళ్లింది. దీంతో పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేసి అనిల్, నీలేష్ లను అరెస్టు చేశారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Maharashtra, Man commit to suicide

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు