MAHARASHTRA MAN ARRESTED FOR STABBING GIRLFRIEND AFTER SHE REFUSES TO ELOPE WITH HIM PAH
ప్రియురాలు దానికి ఒప్పుకోలేదని.. నడి రోడ్డు మీద ప్రియుడు అందరి ముందే ఎంత పనిచేశాడు..
ప్రతీకాత్మక చిత్రం
Maharashtra: అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామని అన్నాడు. దీనికి అమ్మాయి నిరాకరించింది.
కొందరు యువకులు అమ్మాయిల పట్ల షాడిస్ట్ లు ప్రవర్తిస్తుంటారు. అమ్మాయిలను ప్రేమ పేరుతో వేధిస్తుంటారు. అవతలి వారు ఇష్టం లేదని చెప్పిన వినిపించుకోరు. వారిని ఫాలో అవుతు ఇబ్బందులు పెడుతుంటారు. మరికొంత మంది... ప్రేమించామని, తమను పెళ్లి (Wedding) చేసుకొవాలని బలవంతం పెడుతుంటారు. అమ్మాయి కొంత సమయం కావాలని చెప్పిన పట్టించుకొరు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలో.. అమ్మాయిలపై (Harassment on woman) కొంత మంది యువకులు దాడులు చేస్తుంటారు. చంపడానికి సైతం వెనుకాడరు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. మహారాష్ట్ర (Maharashtra) దారుణం జరిగింది. థానె జిల్లాలోని భివండి ప్రాంతంలో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఈ ఘటన 24న తేదిన జరిగింది. కాగా, రాజేష్, భారతి అనే యువతి యువకులు ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే, ఇరువురి ఇళ్లలో వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకొలేదు. దీంతో రాజేష్.. భారతిని లేచిపోయి పెళ్లి (marriage) చేసుకుందామని బలవంతం పెట్టాడు. దీనికి యువతి అంగీకరించలేదు . దీంతో అతను కంట్రోల్ తప్పాడు.
ఒక రోజు భారతి ఇంట్లో నుంచి మార్కెట్ కు వెళ్లింది. అప్పుడు ఆమెను నడిరోడ్డుమీద గొడవ పడి కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె రోడ్డుమీదనే కుప్పకూలిపడిపోయింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు ట్రీట్ మెంట్ అందించారు . ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగా ఉంది. బాధిత యువతీ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రాజేష్ ను అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా కర్ణాటకలో ఒక బ్యాంకు మేనెజర్ యువతి హనీ ట్రాప్ వలలో పడ్డాడు.
ఇండియన్ బ్యాంక్ లో ఆడిట్ కు వచ్చిన అధికారులు డబ్బులు నిల్వలు తక్కువగా ఉండటంతో ఆరా తీయగా ఘటన వెలుగులోనికి వచ్చింది. బెంగళూరులోని హనుమంతనగర్లో ఉన్న ఇండియన్ బ్యాంక్ మేనెజర్ హరిశంకర్, డేటింగ్ యాప్ లో యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త కాల్స్.. వరకు వెళ్లింది. హరిశంకర్ ఆమె బుట్టలో పడిపోయాడు. ఈ క్రమంలో.. తన ప్రియురాలి కోసం కస్టమర్ లు బ్యాంక్ లో పెట్టిన సోమ్మును ఆమె చెప్పిన అకౌంట్ లకు ట్రాన్స్ ఫర్ చేశాడు.
అతగాడు.. ఏకంగా .5.7 కోట్లను యువతి చెప్పిన అకౌంట్ లకు మళ్లించాడు. కాగా, మే 13 నుంచి 19 మధ్య ఈ లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు వెస్ట్ బెంగాల్ లో 28 ఖాతాలకు, కర్ణాటకలోని 2 ఖాతాలకు.. మొత్తం 136 లావాదేవీల్లో డబ్బులను ట్రాన్స్ ఫర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అంతే కాకుండా అతని పర్సనల్ డబ్బులు.. 12.5 లక్షలను కూడా ట్రాన్స్ ఫర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు హరిశంకర్ ను అరెస్టు చేశారు. అనేక కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.