MAHARASHTRA HUMAN BRAIN EYES EARS FOUND IN SHOP IN NASHIK PAH
Shocking: వామ్మో.. షాపులో మనిషి ... మెదడు, కళ్లు, చెవులు.. అసలేం జరిగిందంటే..
విచారణ చేపట్టిన పోలీసులు
Maharashtra: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఒక భయంకర ఘటన కలకలంగా మారింది. ఒక షాపులో మనిషి, మెదడు, చెవులు, కళ్లు వెలుగు చూశాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Human Brain Eyes Ears Found Nashik: నాసిక్ జిల్లాలోని ముంబై నాకా ప్రాంతం ప్రజలు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. ఒక షాపులో మానవ అవయవాలు బయట పడ్డాయి. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాసిక్ లోని ముంబై నాకా ప్రాంతంలో ఒక షాపు ఉంది. దానిలో పాత సామానులు ఉంటాయి. అయితే, ఆ షాపు కొద్ది రోజులుగా మూసి ఉంది. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి షాపు నుంచి తీవ్ర దుర్వాసన బయటకు వస్తుంది. దీంతో చుట్టు పక్కల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. దీనితో భరించలేక.. వారు ఆదివారం అర్దరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు షాపును తెరచిచూశారు.
అప్పుడు అక్కడ ఉన్న వారంతా షాక్ కు గురయ్యారు. ఆ షాపు లోపల మానవ, మెదడు, కళ్లు, చెవులు ఉండటాన్ని గుర్తించారు. దాని నుంచి దుర్వాసన వ్యాపిస్తుంది. పోలీసులు వెంటనే ఫోరెన్సీక్ వైద్య సిబ్బందిని రప్పించారు. మానవ అవయవాలును పరీకల కోసం ల్యాబ్ కు తరలించారు. అయితే, షాప్ యజమాని కూతుళ్లు ఇద్దరు వైద్యులు. ఒక వేళ.. వారు వైద్య పరీక్షల కోసం అవయవాలు తెప్పించు కున్నారా... లేదా ఎవరినైన చంపేసి ఇక్కడ పారేసి ఉంటారా.. అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.
ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఒక క్రైమ్ ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ ఘటన మార్చి 24 న జరిగింది. ఇంటర్ చదివే యువతి తన ప్రాక్టికల్స్ పరీక్షల కోసం సూరజ్ పూర్ కు వచ్చింది. ఆమె తల్లిదండ్రులు బిలాస్ పూర్ లో ఉంటున్నారు. తండ్రికి ఆరోగ్యం బాగాలేక పోవడం వలన.. అతడిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఇంటర్ విద్యార్థి తన ల్యాబ్ పరీక్షల కోసం.. తన సోదరుడితో కలిసి సూరజ్ పుర్ లో ఒక ఇంట్లో ఉంటుంది. ఈ క్రమంలో బాలికపై.. సబీర్ అలీ ఖాన్ అనే యువకుడు కన్నేశాడు. ఆమె ఇంట్లో సింగిల్ ఉన్నట్లు చూశాడు. ఆమె బాలుడు బయటకు వెళ్లగానే ఇంట్లోకి ప్రవేశించాడు.
బాలికను ఇంట్లో బంధించి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత.. విషయం బయటకు వస్తే ఎలా అని.. ఆమె గొంతు కోసి హత్యచేశాడు. ఆ తర్వాత.. ఒక సూసైడ్ నోట్ రాసి అక్కడ నుంచి పారిపోయాడు. ఆమెను అక్కడే ఉన్న సీలింగ్ కు వేలాడ దీశాడు. ఈ క్రమంలో బాలిక సీలింగ్ కు వేలాడుతూ ఉండటాన్నిస్థానికులు గమనించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించారు.
బాలికను అత్యాచారం చేసి , హత్య చేసినట్లు వైద్యులు నిర్దారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అనుమానితులను అదుపులోనికి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో.. 23 ఏళ్ల సబీర్ అలీ ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. వెంటనే అతడిని అరెస్టు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత బంధువులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.