వర్జినిటీ పరీక్షకు నో చెప్పినందుకు.. అందరూ కలిసి కుటుంబాన్ని..

మహారాష్ట్రలోని అంబర్‌నాథ్అ నే ఊరిలో కొత్తగా పెళ్లైన జంట వర్జినిటీ టెస్ట్‌కు నో చెప్పింది. దీంతో ఆ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేశారు.

news18-telugu
Updated: May 20, 2019, 3:49 PM IST
వర్జినిటీ పరీక్షకు నో చెప్పినందుకు.. అందరూ కలిసి కుటుంబాన్ని..
నమూనా చిత్రం
news18-telugu
Updated: May 20, 2019, 3:49 PM IST
మహారాష్ట్రలోని కంజార్‌భట్ తెగతో పాటు మరికొన్ని సమూహాల్లో కన్యత్వ పరీక్షల ఆచారం కొనసాగుతుంది. పెళ్లయిన తరువాత తొలిరాత్రి వధువుకు కన్యత్వ పరీక్ష చేసే ఆచారం ఉంది. నవదంపతులు తొలి రాత్రి గడిపిన తరువాత వారి పడకపై ఉన్న దుప్పటిపై రక్తం మరక ఉందో లేదో చూసి పెళ్లికూతురు కన్యో కాదో నిర్ణయిస్తారు. అయితే, దీని వల్ల స్త్రీలు తమ హక్కులను కోల్పోతున్నారని, ఆ ఆచారంపై వ్యతిరేకంగా పోరాడారు. దీంతో కన్యత్వ పరీక్షను నేరంగా పరిగణిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, అంబర్‌నాథ్ అనే ఊరిలో కొత్తగా పెళ్లైన జంట వర్జినిటీ టెస్ట్‌కు నో చెప్పింది. దీంతో ఆ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేశారు. ఈ మధ్య వారి కుటుంబంలో ముసలావిడ చనిపోతే, ఎవరూ సాయం అందించకపోగా.. పక్కనే ఓ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు సౌండ్ బాక్స్ ఏర్పాటు చేసి ఎక్కువ ధ్వనితో ఆ కుటుంబాన్ని ఇబ్బందికి గురి చేశారట.

వారి చర్యలతో విసిగిపోయిన ఆ కుటుంబం గత గురువారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చిందీ ఘటన. నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆ రాష్ట్ర మంత్రి రంజిత్ పాటిల్ మాట్లాడుతూ వర్జినిటీ పరీక్షను లైంగిక దాడిగా పరిగణిస్తూ చట్టాన్ని మరింత పటిష్ఠం చేస్తామని తెలిపారు.


First published: May 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...