• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MAHARASHTRA ENGINEERING STUDENT TRIES TO ENTER PAKISTAN TO MEET GIRL ARRESTED IN GUJARAT BA

పాకిస్తాన్ అమ్మాయి కోసం బోర్డర్ దాటబోయిన యువకుడు.. అంతలో..

పాకిస్తాన్ అమ్మాయి కోసం బోర్డర్ దాటబోయిన యువకుడు.. అంతలో..

(ప్రతీకాత్మక చిత్రం, image: Pexels)

ఇండియా, పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు పట్టుబడ్డాడు.

  • Share this:
    పాకిస్తాన్‌లో ఉన్న ఓ అమ్మాయిని కలిసేందుకు ఓ యువకుడు బోర్డర్ దాటేందుకు ప్రయత్నించాడు. ఇండియా, పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు పట్టుబడ్డాడు. యువకుడిని పట్టుకున్న బీఎస్ఎఫ్ బలగాలు అతడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ యువకుడి కథ తెలుసుకుని పోలీసులు కూడా షాక్ తిన్నారు. ఆ యువకుడి పేరు సిద్దికి. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌కు చెందిన వాడు. 20 సంవత్సరాల సిద్ధికి ఇంజినీరింగ్ చదువుతున్నాడు. సోషల్ మీడియాలో ఓ అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి కరాచీలో ఉంటానని చెప్పింది. సోషల్ మీడియాలోనే ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయిని కలవాలని అనుకున్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా పాకిస్తాన్‌కు కూడా ఎలాంటి విమానాలు, రాకపోకలు లేవు. ఈ క్రమంలో ఎలాగైనా బోర్డర్ దాటాలని భావించాడు. తన వద్ద ఉన్న బైక్ మీద మహారాష్ట్ర నుంచి బయలుదేరాడు. గూగుల్ మ్యాప్స్‌లో వెతుక్కుంటూ వెళ్లాడు. అలా వెళ్తూ వెళ్తూ చివరకు అతడి బైక్ రన్ ఆఫ్ కచ్‌లో ఇసుకలో ఇరుక్కుపోయింది. ఆ తర్వాత యువకుడు నడక మొదలు పెట్టాడు.

    ఇసుక తిన్నెల్లో ఓ బైక్ పడిపోయి ఉందంటూ బీఎస్ఎఫ్ జవాన్లకు సమాచారం వచ్చింది. దీంతో వారు అప్రమత్తం అయ్యారు. సరిహద్దుల్లోని ధోలావీరా గ్రామం వద్ద ఓ యువకుడిని అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని పట్టుకున్నారు. గురువారం రాత్రి అతడిని అదుపులోకి తీసుకున్నాడు. ఇసుక తిన్నెల్లో బండి ముందుకు కదలకపోవడంతో చాలా దూరం నడిచానని, చివరకు స్పృహతప్పి కూడా పడిపోయానని బాధితుడు వారికి చెప్పినట్టు తెలిసింది. అసలు ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడకు వచ్చావని ప్రశ్నిస్తే అసలు విషయం చెప్పాడు. దీంతో పోలీసులు అతడిని వివరాలు ఆరా తీశారు.

    జూలై 11న అతడు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఆ సమయంలో కుటుంబసభ్యులు పోలీసులకు మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చారు. ఉస్మాన్‌బాద్ పట్టణంలో అతడి కోసం మిస్సింగ్ కంప్లెయింట్ ఉందంటూ మహారాష్ట్ర పోలీసులు గుజరాత్ పోలీసులకు క్లారిటీ ఇచ్చారు. తాము కూడా అతడి సోషల్ మీడియా అకౌంట్లు చెక్ చేశామని, అతడు పాకిస్తాన్‌లోని కరాచీలోఉన్న ఓ అమ్మాయితో సోషల్ మీడియాలో చాటింగ్ చేసినట్టు గుర్తించామని మహారాష్ట్ర పోలీసులు చెప్పారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు