Home /News /crime /

MAHARASHTRA DEATH SENTENCE FOR MAN WHO KILLED MOTHER FRIED AND ATE HER BODY PARTS SU

Maharashtra: తల్లిని చంపి.. ముక్కలను వేయించుకుని తిన్న కొడుకు.. కోర్టు ఏ శిక్ష విధించిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొన్ని నేరాల గురించి వింటూంటే తీవ్ర భయాందోళన కలుగుతుంది. అలాంటి ఓ నేరం గురించే మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. ఓ వ్యక్తి తన తల్లిని దారుణంగా చంపి.. ముక్కలు ముక్కలుగా కోసి.. కొన్ని భాగాలను నూనెలో వేయించుకుని తిన్నాడు.

    కొన్ని నేరాల గురించి వింటూంటే తీవ్ర భయాందోళన కలుగుతుంది. అలాంటి ఓ నేరం గురించే మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. ఓ వ్యక్తి తన తల్లిని దారుణంగా చంపి.. ముక్కలు ముక్కలుగా కోసి.. కొన్ని భాగాలను నూనెలో వేయించుకుని తిన్నాడు. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తికి తాజాగా కోర్టు మరణ శిక్ష విధించింది. వివరాలు.. మహారాష్ట్రలోని కోల్హాపూర్‌కు చెందిన సునీల్ రామా మద్యానికి బానిసగా మారాడు. 2017 ఆగస్టు 28న తన తల్లితో గొడవపడి ఆమెను హత్యచేశాడు. ఆమె మృతదేహం రక్తం మడుగులో ఉండగానే.. కొన్ని భాగాలను కోసి వాటిని నూనెలో వేయించడం మొదలుపెట్టాడు. కొన్నింటిని తినేశాడు.

    అయితే సునీల్ అతని తల్లి మృతదేహం వద్ద ఉన్నప్పుడు ఆ ప్రాంతంలోని చిన్నారి చూసి గట్టిగా ఏడవడం ప్రారంభించింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్నవారు జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వచ్చేసరికి రక్తపు మడుగులో ఉన్న మృతదేహం గుండె ఓ పళ్ళెంలో ఉండగా.. మరికొన్ని అవయవాలు పొయ్యి మీద ఆయిల్‌ పెనంలో ఉన్నాయి. దీంతో పోలీసులు సునీల్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సునీల్ కూడా తన తల్లిని చంపినట్టుగా అంగీకరించారు.

    ఈ కేసుకు సంబంధించి స్థానిక కోర్టు తాజాగా తుది తీర్పును వెలువరించింది. సునీల్ ఉరి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. నేరం చేసినందుకు సునీల్‌లో ఎలాంటి పశ్చాత్తాపం లేదని గమనించినట్టుగా పేర్కొన్నారు. ‘సునీల్ తల్లి అనుభవించిన బాధను మాటల్లో వివరించలేము. మద్యం బానిసగా మారి.. అతను ఈ నేరానికి పాల్పడ్డాడు. అతను తన నిస్సహాయ తల్లికి జీవితం లేకుండా చేశాడు. అతన్ని చనిపోయే వరకు ఉరి తీయాలి’అని కొల్హాపూర్ అదనపు సెషన్స్ జడ్జి మహేష్ కృష్ణజీ జాదవ్ పేర్కొన్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Maharashtra, Murder

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు