హోమ్ /వార్తలు /క్రైమ్ /

కొంప ముంచిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్.. వరుడి స్నేహితులపై కేసు.. అసలేం జరిగిందంటే..

కొంప ముంచిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్.. వరుడి స్నేహితులపై కేసు.. అసలేం జరిగిందంటే..

ఏప్రిల్ 14 నుంచి మూడు నెలల పాటు జరిగే లగ్నాల్లో లగ్నంలో ఈ ఏడాది దేశవ్యాప్తంగా 40 లక్షల వివాహాలు జరగవచ్చని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (క్యాట్) పేర్కొంది. ఇది మందగించిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తుందని భావిస్తున్నారు.

ఏప్రిల్ 14 నుంచి మూడు నెలల పాటు జరిగే లగ్నాల్లో లగ్నంలో ఈ ఏడాది దేశవ్యాప్తంగా 40 లక్షల వివాహాలు జరగవచ్చని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (క్యాట్) పేర్కొంది. ఇది మందగించిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తుందని భావిస్తున్నారు.

Shocking: స్నేహితుడి పెళ్లిలో వారంతా ఎంజాయ్ చేశారు. వరుడిని సరదాగా ఆట పట్టించారు. వేడుక అయ్యే వరకు ఎంతో ఉల్లాసంగా గడిపారు. ఫన్నీ ఈవెంట్ ను ఫుల్ జోష్ తో ఎంజాయ్ చేశారు. కానీ వారు సరదాగా చేసిన పని ప్రస్తుతం వారి కొంప ముంచింది.

Wedding Tragedy: మహారాష్ట్రలో పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. స్నేహితుడి వెడ్డింగ్ కి సరదాగా గడపడానికి వచ్చి చిక్కుల్లో ఇరుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన కలకలంగా మారింది. సాధారణంగా పెళ్లి వేడుకలో రకరకాల సంప్రదాయాలు ఉంటాయి. కొందరు తమ పెళ్లి వేడుకను ఎప్పటికి గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకొవాలను కొంటారు.

దీని కోసం ఎంత ఖర్చు పెట్టడానికైన వెనుకాడరు. సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించి అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో జరుగుతున్న ఫన్నీ సంఘటనల కారణంగా ఇవి వైరల్ అవుతున్నాయి. వీటిని చూడటానికి నెటిజన్లు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ ఒక్కొసారి పెళ్లి వేడుకలో విషాద సంఘటనలు కూడా జరుగుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి సంఘటన మహారాష్ట్రలో జరిగింది.

పూర్తి వివరాలు.. మహారాష్ట్రలోని అంబజోగై ప్రాంతంలో ఒక పెళ్లి వేడుకలో అనుకొని ట్వీస్ట్ జరిగింది. మార్చి 26న బాలాజీ భాస్కర్ అనే వ్యక్తి పెళ్లి జరిగింది. ఈ వేడుకలో అతని మిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వేడుకలో.. హల్దీ కార్య క్రమం నిర్వహించారు. అంతకు మందు ప్రీవెడ్డింగ్ షూట్ నిర్వహించారు.

అందులో వరుడి స్నేహితులు కూడా పాల్గొన్నారు. దీనిలో వరుడి స్నేహితులు గన్ తీసుకుని సరదాగా గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీసుల వరకు వెళ్లింది. ఈ క్రమంలో పోలీసులు వరుడి స్నేహితులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది.

తమిళనాడులో ఒక క్రైమ్ స్టోరీ గతంలో వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. తమిళనాడులోని  (Tamil nadu) వేలూరులో ఈ దారుణం జరిగింది. స్థానిక పాఠశాలలో 7 వ తరగతి చదివే బాలికపై.. అదే స్కూల్ కు చెందిన మురళీకృష్ణ అనే ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించాడు. బాలికకు 13 ఏళ్లు. ప్రతి రోజు బాలిక పట్ల తరగతిలోనే అసభ్యంగా ప్రవర్తించేవాడు. బాలిక.. ఎన్నిసార్లు చెప్పిన అతను.. తన వంకర బుద్ధిని మార్చుకోలేదు. దీంతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది.

ఇక భరించలేక గత శనివారం... ఇంట్లో ఉన్న వార్నిష్ ను తాగింది. దీంతో బాలిక అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయింది. బాలికను గమనించిన ఆమె తల్లిదండ్రులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దీంతో ఈ దారుణం వెలుగులోనికి వచ్చింది. బాలిక కుటుంబ సభ్యులు కీచక ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సోమవారం నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Crime news, Maharashtra, Wedding

ఉత్తమ కథలు