హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఇంటర్యూకు వచ్చిన మహిళను లొంగదీసుకుని.. ఆ వీడియోలు బయటపెడతానని బ్లాక్‌మెయిల్.. నాలుగేళ్ల తర్వాత..

ఇంటర్యూకు వచ్చిన మహిళను లొంగదీసుకుని.. ఆ వీడియోలు బయటపెడతానని బ్లాక్‌మెయిల్.. నాలుగేళ్ల తర్వాత..

ఇంటర్యూకు వచ్చిన మహిళతో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను దారుణంగా మోసం చేశాడు. బ్లాక్‌మెయిల్ చేసి రూ. 33 లక్షల రూపాయలు దోచుకున్నాడు.

ఇంటర్యూకు వచ్చిన మహిళతో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను దారుణంగా మోసం చేశాడు. బ్లాక్‌మెయిల్ చేసి రూ. 33 లక్షల రూపాయలు దోచుకున్నాడు.

ఇంటర్యూకు వచ్చిన మహిళతో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను దారుణంగా మోసం చేశాడు. బ్లాక్‌మెయిల్ చేసి రూ. 33 లక్షల రూపాయలు దోచుకున్నాడు.

  ఇంటర్యూకు వచ్చిన మహిళతో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను దారుణంగా మోసం చేశాడు. బ్లాక్‌మెయిల్ చేసి రూ. 33 లక్షల రూపాయలు దోచుకున్నాడు. లేదంటే వారిద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు బయట పెడతానని బెదిరించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధిత మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని హోటల్ మేనేజర్‌గా పనిచేస్తున్న పంకజ్ పాటియాల్‌గా గుర్తించారు.అతన్ని అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. వివరాలు.. నాగ్‌పూర్‌ దంటోలో పంకజ్‌కు చెందిన హోట‌ల్‌కు బాధిత మహిళ 2017లో ఇంటర్వ్యూకు వెళ్లింది. ఆ సమయంలో ఆమెకు నిందితుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని అడ్డుపెట్టుకుని పంకజ్ మహిళను బలవంతంగా లొంగదీసుకున్నాడు. అతనికి ఇదివరకే పెళ్లి అయినప్పటికీ.. బాధిత మహిళను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు.

  ఆ తర్వాత పంకజ్ తాను హోటల్స్ స్టార్ చేయడం కోసం డబ్బులు కావాలని ఆమెను తరుచూ ఆడిగేవాడు. ఇక, కొద్ది రోజులకు బాధిత మహిళను పెళ్లి చేసుకుంటానని మాటలను పంకజ్ విస్మరించాడు. దీంతో పంకజ్‌కు బాధిత మహిళకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే అప్పుడు పాటియాల్.. వారిద్దరు సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలను చూపించి.. బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. పంకజ్ ఆ వీడియోలను, ఫొటోలను లీక్ చేస్తాడేమోననే భయంతో బాధిత మహిళ తన సేవింగ్స్ నుంచి రూ. 11 లక్షల రూపాయలు చెల్లించింది. ఆ తర్వాత మరిన్ని డబ్బులు కావాలని ఒత్తిడి చేయడంతో.. ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి రూ. 20 లక్షలు అప్పుచేసి అతనికి ఇచ్చింది. అంతకంటే ముందుగా పంకజ్ తన తల్లికి ఆరోగ్యం బాగోలేదనే సాకుతో బాధిత మహిళ నుంచి రెండు లక్షల రూపాయలు విలువ చేసే 5 తులాల బంగారం తీసుకున్నాడు.

  ఇలా మొత్తంగా బాధిత మహిళ పంకజ్‌కు రూ. 33 లక్షలు సమర్పించింది. ఇక, నాగ్‌పూర్‌లో తన హోటల్స్ ప్లాన్స్ విఫలం కావడంతో పంకజ్ ఉత్తరాఖండ్ పారిపోయాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకన్న సోనెగావ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లో ఉన్న పంకజ్‌ను అరెస్ట్ చేశారు. ఈ నేరంలో ప్రమేయం ఉన్న అతని భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే హోటల్స్ ప్రారంభించాలనే నెపంతో పంకజ్ మరికొందరి వద్ద నుంచి కూడా డబ్బులు తీసుకుని మోసం చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

  First published:

  Tags: Blackmail, Crime news, Maharashtra

  ఉత్తమ కథలు