MAHARASHTRA 9 DOCTORS SERIOUSLY INJURED AFTER HOSPITAL LIFT FAILS IN RAIGAD DISTRICT PAH
Shocking: ఆస్పత్రిలో విషాదం.. రోప్ వే తెగిపోయి కింద పడిన లిఫ్ట్.. 9 మంది వైద్యులకు తీవ్ర గాయాలు..
ప్రమాదం జరిగిన ఆస్పత్రి
Maharashtra: ఆస్పత్రిలో వైద్యులు గ్రౌండ్ ఫ్లోర్ వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. ఈ క్రమంలో.. లిఫ్ట్ రెండో అంతస్తుకు వెళ్లిందో.. లేదో రోప్ వే ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో లిఫ్ట్ కుప్ప కూలి కింద పడిపోయింది.
Raigad Hospital Lift Collapse : మహారాష్ట్రలో అనుకోని ప్రమాదం జరిగింది. రాయ్ గఢ్ ఆస్పత్రిలో వైద్యులకు షాకింగ్ ఘటన ఎదురైంది. వైద్యులు ఆస్పత్రిలో మూడో అంతస్థు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కు వెళ్తున్నారు. ఈ క్రమంలో లిఫ్ట్ ఒక్కసారిగా తెగి కింద పడిపోయింది. లిఫ్ట్ లో ఉన్న వైద్యులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. ఈ ఘటన శుక్రవారం రాయ్ గఢ్ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్ గఢ్ లోని న్యూ పన్వేల్ నగరంలో ఆమ్లే ఆస్పత్రి ఉంది. డాక్టర్లు మూడవ అంతస్తులో ఆహారం తీసుకున్నాక కిందకు వచ్చేటప్పుడు ప్రమాదం జరిగింది.
ఇందులోని లిఫ్ట్ లో కొంత మంది వైద్యులు ఎక్కారు. అది కిందకు వచ్చే క్రమంలో.. రెండో అంతస్థు వద్దకు చేరగానే ఒక్కసారిగా రోప్ వే తెగిపోయి కుప్పకూలి కిందపడింది. దీంతో వైద్యులు షాకింగ్ కు గురయ్యారు. లిఫ్ట్ లో తొమ్మిది మంది వైద్యులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో సిబ్బంది వెంటనే అగ్ని మాపక శాఖకు సమాచారం అందించారు.
అగ్ని మాపక శాఖ అధికారులు.. ఘటన స్థలానికి చేరుకుని లిఫ్ట్ తలుపులు తెరిచారు. వెంటనే గాయాల పాలైన వైద్యులు బయటకు వచ్చేశారు. ఒక వేళ లిఫ్ట్ ఇంకా... పై అంతస్తు నుంచి పడితే పరిస్థితి ఏంటని డాక్టర్లు.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు మూడవ అంతస్తులో ఆహారం తీసుకున్నారు. ఆ తర్వాత.. మాట్లాడు కుంటు అందరు లిఫ్ట్ లో ఎక్కారు.
అది పరిమితికి మించి అందు లో ఎక్కారు. ఈ క్రమంలో కిందకు వచ్చేటప్పుడు రోప్ వే తెగిపోయింది. ఈ ప్రమాదం జరిగింది. గాయపడిని వైద్యులను ఇతర ఆస్పత్రులలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. పరిమితిని మించి ఎక్కువ మంది ఎక్కడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.