Telangana Crime News: పొలం విషయంలో గొడవ.. చివరకు భార్య కట్టుకున్న భర్తను ఏం చేసిందో తెలుసా..

జేసీబీతో ఇంటిని కూలుస్తున్న దృశ్యం

Telangana Crime News: తమ వద్ద ఉన్నరెండెకరాల్లో ఒక ఎకరం పొలం పొలం అమ్మేస్తానని అంటున్నాడని కొడుకు.. తన బంధువులతో కలిసి ఓ భార్య తన భర్తను చంపేసింది. తరువాత మృతదేహాన్ని కొత్తగా కట్టుకుంటున్న ఇంటి బాత్రూమ్ లో పాతిపెట్టిన ఘటన కలకలం సృష్టించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  భూమి గొడవల్లో బంధువులు, కన్నవారు అనే సంబంధం లేకుండా.. హత్యలు విపరీతంగా జరుగుతున్నాయి. ఇటీవల వరంగల్‌ (Warangal) ఎల్బీనగర్‌లో జరిగిన దారుణ హత్య(Murder) సంఘటనతో నగరంతోపాటు ఉమ్మడి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒక ప్రదేశంలో జరుగుతూనే ఉన్నాయి. డబ్బుల కోసం కన్నవారినే అంతమొందిచే ఘటనలు.. కన్నవారే బిడ్డలను చంపివేసే దారుణాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. మానవసంబంధాలు కేవలం ఆర్థిక సంబంధాలే అన్న మాటలను నిజం చేసే దిశగా ఈ హత్యలు.. దారుణాలు జరుగుతున్నాయి. అటువంటిదే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో. డబ్బుల కోసం ఏకంగా ఓ భార్య కట్టుకున్న భర్తనే అత్యంత దారుణంగా చంపి బాత్రూమ్ లో పాతిపెట్టింది.

  ఆ తర్వాత తిన్నగా వెళ్లి ఆమె తన భర్త కనిపించట్లేదు సార్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలా రెండు నెలలు గడిచిపోయాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్థు ప్రారంభించినా.. ఎక్కడా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈక్రమంలో సదరు భార్యపై అనుమానం వచ్చిన పోలీసులు ఆదిశగా దర్యాప్తు చేయగా భార్య భర్తను చంపింనట్లుగా రుజువైంది. ఈ దారుణ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్​నగర్​ జిల్లా (Mahabub Nagar District)  నవాబుపేట మండలం మొరంబావి గ్రామానికి చెందిన 45 ఏళ్ల చెన్నయ్య (Chennaiah) రాములమ్మ దంపతులు.

  Newborn Baby: చెత్త కుప్పలో మగ శిశువు.. బావిలో దూకిన మైనర్ బాలిక.. అసలేమైందంటే..

  వారికి రెండు ఎకరాల పొలం ఉంది. అందులో ఒక ఎకరం పొలం అమ్మారు. దాంతో ఒక ఎకరం పొలం అమ్మి వచ్చిన డబ్బులతో కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు. ఇంటి పనులు మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా.. తన సోదరుడు కనిపించడం లేదంటా.. అతడి అక్కలు, చెల్లెలు కంగారు పడ్డారు.

  ఓ రోజు ఇంటికి వచ్చి తన సోదరుడు చెన్నయ్య కనిపించడం లేదుంటూ.. రాములమ్మపై అనుమానంతో ఆమెను నిలదీశారు. మొదట తన భర్తపై ప్రేమ నాకు ఉండదా.. తాను బాధపడుతున్నానని ముసలి కన్నీరు కార్చింది.

  Organ Donation: అవయవదానంలో కూడా వీడని స్నేహం.. చనిపోయి కూడా 13 మందిని బతికించారు.. ఎక్కడంటే..

  కానీ రాములమ్మ (Ramulamma) మాటల్ని చెన్నయ్య అక్కలు నమ్మలేదు. ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో చెన్నమ్మ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. తన వదినపైనే అనుమానంగా ఉందని.. పోలీసులకు చెప్పారు. దీంతో పొలీసులు ఆమను తమదైన శైలిలో విచారంచగా.. తానే హత్య (Murder) చేసినట్లు ఒప్పుకుంది. మిగిలిన ఎకరం పొలాన్ని కూడా అమ్ముతానని చెన్నయ్య గొడవ చేస్తున్నాడనీ..అందుకే చంపానని చెప్పింది.

  కొడుకు రమేశ్, అదే గ్రామానికి చెందిన తన అక్క భర్త పెంటయ్య, చెల్లెలి భర్త రఘుతో కలిసి చెన్నయ్యను చంపేసినట్లు రాములమ్మ చెప్పింది. కొత్తగా కడుతున్న ఇంటి బాత్​రూంలో (Bathroom) శవాన్ని పాతిపెట్టామని తెలిపింది.

  Minor Girl: ఆన్‌లైన్‌ క్లాసులు పక్కనపెట్టి.. నగ్న వీడియోలను వెబ్ సైట్ లో పోస్టు చేసిన బాలిక.. చివరకు..

  ఆమె చెప్పిన మాటలకు పోలీసులు షాక్ అయ్యారు. తాను ఎక్కడ పాతిపెట్టానో తెలియదని.. ఇంట్లోని రెండు మూడు చోట్ల చూపించింది. దీంతో పోలీసులకు చిరాకు వచ్చింది. మరో సారి ఆమెను గట్టిగా నిలదీయగా.. బాత్రూమ్ లో పాతిపెట్టానని చూపించింది.

  దీంతో పోలీసులు స్థానిక తహసీల్దార్ సమక్షంతో ఇంట్లోని ఆమె చూపించిన స్థలంలో తవ్వి.. డెడ్ బాడీని (Dead Body) తీశారు. తర్వాత పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. భర్తను చంపి బాత్రూమ్ లో పాతిపెట్టిన విషయం తెలుసుకున్న స్థానికులు మతదేహాన్ని తవ్వే ప్రాంతానికి భారీగా తరలివచ్చారు.
  Published by:Veera Babu
  First published: