Home /News /crime /

MAHABUBNAGAR WOMAN BRUTALLY MURDERED BY A YOUNG MAN WHO HAVE BEEN IN AFFAIR WITH HER WHILE HUSBAND IN SAUDI HSN

ఓ కుర్రాడితో భార్యకు అఫైర్.. సౌదీ నుంచే వీడియో కాల్ చేసి కన్నీళ్లు పెట్టుకున్న భర్త.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కుటుంబ అప్పులను తీర్చేందుకు భర్త సౌదీకి వెళ్లాడు. పిల్లలను చక్కగా చూసుకోవాల్సిన భార్య పెడదోవ పట్టింది. ఓ కుర్రాడితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. చివరకు అదే ఆమె ప్రాణాలను తీసింది. అసలేం జరిగిందంటే..

  ఉపాధి నిమిత్తం భర్త సౌదీకి వెళ్లాడు. ముగ్గురు పిల్లలతో ఆ భార్య సంసారాన్ని నడుపుతోంది. బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిందా మహిళ. అలా వెళ్లిన మహిళ అర్ధరాత్రి అయినా తిరిగి ఇంటికి చేరలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల అంతా వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల తర్వాత కానీ అసలు విషయం తెలియలేదు. ఆమెతో వివాహేతర సంబంధం ఉన్న ఓ కుర్రాడి నిర్వాకం ఆలస్యంగా బయటపడింది. గతంలో ఇచ్చిన డబ్బును తిరిగి అడుగుతోందని కోపం పెంచుకున్నాడు. అంతే కాకుండా ఆమె వద్ద ఉన్న నగలపై ఆశ పెంచుకున్నాడు. అదను చూసి ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్ మండలం ఆముదాల గడ్డ తండాకు చెందిన గోపాల్ నాయక్ అనే వ్యక్తికి భార్య సోమీబాయి, పిల్లలు సంధ్య, మౌనిక, సంతోష్‌ ఉన్నారు. కుటుంబ అప్పులు తీర్చేందుకు ఉపాధి నిమిత్తం గోపాల్ నాయక్ కొన్నేళ్ల క్రితం సౌదీకి వెళ్లాడు. అక్కడే పనిచేస్తూ నెల నెలా డబ్బులు పంపిస్తూ ఉండేవాడు. అయితే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుంచి రాహూల్ అనే కుర్రాడు మహమ్మదాబాద్ కు వలస వచ్చాడు. చుట్టు పక్కల గ్రామాల్లో ఐస్ క్రీములు అమ్మడం, పాత సామాన్లు కొనులుగోలు చేయడం వంటివి చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే సోమీబాయితో రాహూల్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. రాహూల్ అడిగినప్పుడల్లా ఆమె డబ్బులు ఇచ్చేది. అయితే ఇతర అవసరాలు రావడంతో రాహూల్ ను సోమీబాయి డబ్బులు అడిగింది. కొద్ది రోజుల్లో ఇస్తానని అతడు చెప్పాడు.
  ఇది కూడా చదవండి: నాలుగు నెలల క్రితం పెళ్లి.. భార్య గర్భవతి.. ఆమె గురించి చివరిసారి వాట్సప్ స్టేటస్ పెట్టి మరీ టిక్ టాక్ టోనీ దారుణం..!

  ఏప్రిల్ 5వ తారీఖున సోమీబాయి ఇంట్లోని బంగారు నగలను తీసుకుని బ్యాంకుకు వెళ్లి లోన్ తీసుకుంటానని కుటుంబ సభ్యులతో చెప్పింది. అలా బయటకు వెళ్లిన ఆమె తన ప్రియుడు రాహూల్ ను కలిసింది. ఆమెను రాహూల్ తన బైక్ పై ఎక్కించుకుని వెంకటరెడ్డిపల్లి వైపునకు వెళ్లాడు. మద్యంతోపాటు కూల్ డ్రింక్ కూడా తీసుకుని అటవీ ప్రాంతానికి ఆమెను తీసుకెళ్లాడు. లోతువాగులో ఆమెకు మద్యం తాపించి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను హత్య చేశాడు. ఆమె వద్ద ఉన్న నగలను తీసుకున్నాడు. అర్ధరాత్రి అయినా ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
  ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..

  పోలీసులు నాలుగు రోజుల పాటు అన్ని ప్రాంతాల్లోనూ వెతికారు. నగరంలోని సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించారు. ఓ పెట్రోల్ బంక్ లోని సీసీ కెమెరాలో ఆమె రాహూల్ బైక్ పై వెళ్లడాన్ని చూశారు. అతడిని గుర్తించారు. చివరకు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మొదట తనకు ఏమీ తెలియదని బుకాయించినా ఆ తర్వాత నిజాన్ని వెళ్లగక్కాడు. హత్యా ప్రాంతంలో ఉన్న ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం సౌదీలో ఉన్న భర్త గోపాల్ కు తెలిసి వీడియో కాల్ చేశాడు. పిల్లలతో మాట్లాడుతూ బోరుమని విలపించాడు.
  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Crime news, Crime story, CYBER CRIME, Husband kill wife, Wife kill husband

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు