• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MAHABUBNAGAR POLICE RESCUED 2 MONTHS OLD BABY WHO WAS KIDNAPPED AND SOLD FOR RS 10000 BA

శెభాష్ పోలీస్.. కిడ్నాప్ అయిన పసికందును తల్లి ఒడికి చేర్చారు..

శెభాష్ పోలీస్.. కిడ్నాప్ అయిన పసికందును తల్లి ఒడికి చేర్చారు..

రెండు నెలల పసికందును తల్లిదండ్రులకు అప్పగిస్తున్న ఐపీఎస్ రమారాజేశ్వరి

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ తల్లిదండ్రుల వద్ద నుంచి పసికందును కొందరు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఆ చిన్నారిని రూ.10వేలకు వేరొకరికి అమ్మేశారు.

  • Share this:
    తల్లిదండ్రుల వద్ద నుంచి కిడ్నాప్‌నకు గురైన రెండు నెలల పసికందును మళ్లీ పేరెంట్స్ వద్దకు చేర్చారు పోలీసులు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈనెల 13వ తేదీ రాత్రి 10.45 ని.లకు జిల్లా కేంద్రంలోని వల్లబ్ నగర్ ఎర్రగుట్ట ప్రాంతంలో, గాఢనిద్రలో ఉన్న తల్లి ఒడిలో పడుకున్న రెండు నెలల పసికందును కొందరు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఆ చిన్నారిని రూ.10వేలకు వేరొకరికి అమ్మేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ పసికందును వెతికి పట్టుకున్నారు. అయితే, దుండగులు అప్పటికే ఆ పసికందును అమ్మేశారు. వారి వద్ద నుంచి చిన్నారిని రక్షించిన పోలీసులు.. పాప తల్లిదండ్రులకు అందజేశారు. ఆ పసికందును గుండెలకు హత్తుకున్న తర్వాత ఆ తల్లికళ్లలో చూసిన ఆనందమే పోలీసులకు అతి పెద్ద అవార్డ్ అని ఐపీఎస్ రమా రాజేశ్వరి అన్నారు. ఆ ఘటనకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు