మృతదేహాలు కుళ్లిపోతున్నాయ్... హైకోర్టులో పోలీసుల పిటిషన్...

ఈనెల 9 వరకు మృతదేహాలను ఖననం చేయవద్దని, వాటిని భద్రపరచాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో వాటిని మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఉంచారు.

news18-telugu
Updated: December 7, 2019, 8:38 PM IST
మృతదేహాలు కుళ్లిపోతున్నాయ్... హైకోర్టులో పోలీసుల పిటిషన్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నలుగురి మృతదేహాలు కుళ్లిపోతున్నాయని, వాటిని వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 9 వరకు మృతదేహాలను ఖననం చేయవద్దని, వాటిని భద్రపరచాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో వాటిని మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఉంచారు. అయితే, మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్ లో మృతదేహాలను భద్రపరచే వసతులు లేవని పోలీసులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే మృతదేహాలు డీ కంపోస్ అయ్యాయని తెలిపారు. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా తమ మృత దేహాలను ఇవ్వాలని కోరుతున్నారని పోలీసులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశాలున్నందున ఇక్కడి నుంచి తరిలించేలా ఆదేశాలివ్వాలని జిల్లా ఎస్పీ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈనెల 6న దిశ నిందితుల ఎన్‌కౌంటర్ జరిగింది. అయితే, దీని మీద కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ‘కస్టడీ హత్య’గా అభివర్ణించారు. ఆ పోలీసుల మీద కేసు నమోదు చేయాలని కోరుతూ కొందరు న్యాయవాదులు సుప్రీంకోర్టు, హైకోర్టులకు లేఖలు రాశారు. అదే సమయంలో అఖిలభారత అభ్యుదయ మహిళా సంఘం కూడా హైకోర్టుకు లేఖ రాసింది. మహిళా సంఘాల ఒత్తిడి పేరుతో పోలీసులు హత్యలు చేయకూడదని అందులో పేర్కొంది.

First published: December 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>