వాడో ఖతర్నాక్ దొంగ. జనం గుంపులుగా ఉన్నచోట చేరి సైలెంట్‌గా తన పని కానిస్తాడు. ముఖ్యంగా ఒంటిపై ఖరీదైన నగలు, బంగారు ఆభరణాలతో ఉన్న ఆడవాళ్ల వాటి కంట పడితే అంతే సంగతులు. వాళ్లను నిలువు దోపిడీ చేసే వరకూ వదలడు. ఇది కొత్తేమి కాదు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఈ ప్రొఫెషనల్ చైన్‌స్నాచర్‌ని జిల్లా పోలీసులు తెంపుడు గాడు అని పేరు పెట్టారు. స్టోరీలోకి వెళ్తే ఖతర్నాక్ దొంగ పేరు పాండు, మహబూబ్‌నగర్ (Mahabubnagar)జిల్లా తిమ్మాజిపేట (Timmajipeta) మండలం పుల్లగిరి(Pullagiri)గ్రామ నివాసి. అతని వృత్తి ఏమిటంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ జాతరలు, (Fairs)సంబురాలు (celebrations)జరిగినా అక్కడికి వెళ్లి ఆడవాళ్ల(Ladies)మెడల్లో నగలు(Jewelry), మంగళసూత్రాలు, పుస్తెల తాడు గొలుసులు (Goldchains)లాక్కెళ్లడం. పాండు తన చోర వృత్తిలో బండమీది తండా(Bandamidi Tanda)కు చెందిన శ్రీను (srinu)అనే మరో వ్యక్తిని కలుపుకొని ఇప్పటి వరకు 50చోరీలు చేశాడు. జిల్లాలో జాతర్లు, సంబురాలు లేకపోతే వేరే జిల్లాకు వెళ్లి కూడా చోరీలకు పాల్పడటం పాండు అలవాటు. మహబూబ్‌నగర్ జిల్లాకి చెందిన ఈ సీరియల్ చైన్‌స్నాచర్‌పై వరుస ఫిర్యాదులు వెల్లవెత్తడంతో జడ్చర్ల పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి పట్టుకున్నారు.
జాతరలే వాళ్ల టార్గెట్..
జడ్చర్ల పోలీసులు ఎక్వైరీలో తేలింది ఏమిటంటే ..పుల్లగిరికి చెందిన శ్రీను గత రెండు నెలల క్రితం జడ్చర్ల మండలంలోని గంగాపురంలో జరిగిన లక్ష్మీ చెన్నకేశవస్వామి జాతర మొదటి రోజు కృష్ణవేణి అనే మహిళ మెడలో రెండు తులాల బంగారు గొలుసు కొట్టేశాడు. అదే జాతరలో గంగాపురానికి చెందిన విజయలక్ష్మి అనే మరో మహిళ మెడలో మూడు తులాల గోల్డ్ చైన్ మాయం చేశాడు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుట్ట ప్రాంతానికి ెంచదిన సుప్రజ మెడలో మూడు తులాల బంగారు గొలుసును తెంపుకెళ్లాడు. ఆలూరు, బిజినేపల్లిలో కూడా వరుస చోరీలకు పాల్పడ్డాడు శ్రీను. జాతరకు వెళ్లడం...గుంపులో చేరిపోయి అక్కడ ఏమరపాటుగా ఉన్న మహిళల్ని మెడల్లో నగలు ఎత్తుకెళ్లడం డ్యూటీగా మార్చుకున్నాడు. ఈవిధంగా మహిళల మెడల్లో నగలు దోచుకెళ్తున్న దొంగను జడ్చర్ల పోలీసులు పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి 10.5 తులాల బంగారు నగల్ని రికవరీ చేసుకున్నారు.
ఆడవాళ్ల నగలపైనే కన్ను..
ఏ1 నిందితుడు పాండుపై జడ్చర్ల బొమ్మల రామారం బీబీ నగర్, పెద్దమందడి ఖిల్లా, ఘణపూర్, కేశంపేట, పేట్ బషిరాబాద్, మహేశ్వరం, కీసర, కందుకూరు, తమ్మాజిపేట, బిజినేపల్లి ప్రాంతాల్లో 50కిపైగా కేసులు నమోదైనట్లు జడ్చర్ల డీఎస్పీ కిషన్ తెలిపారు. కష్టపడకుండా డబ్బులు సంపాధించడం...ఆ డబ్బుతో జల్సాలు చేయడం పాండు అలవాటుగా చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. 50కిపైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న పాండు పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినప్పటికి ప్రవర్తన మార్చుకోలేదు. ఇద్దరు దొంగలపై మొత్తం 60కేసులు ఉన్నట్లుగా తేల్చిన పోలీసులు..ఏ1 నిందితుడ పాండుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 10కేసుల్లో నిందితుడిగా ఉన్న సేవ్య శ్రీను పరారీలో ఉన్నాడని..అతడ్ని కూడా పట్టుకొని జైలుకు పంపుతామని జడ్చర్ల పోలీసుల స్పష్టం చేశారు. జాతరలు, గ్రామ పండుగలు జరుగుతున్న ప్రాంతాల్లో మహిళలు అప్రమత్తంగా ఉండాలని..లేదంటే ఇలాంటి చైన్‌స్నాచర్స్ విలువైన సొమ్మును కాజేస్తారని అప్రమత్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Mahabubabad District