హోమ్ /వార్తలు /క్రైమ్ /

Thief Woman : పరిచయంతో అతనికి స్నేహితురాలైంది .. ఫ్రెండ్‌షిప్‌తో ఇంట్లో చేరి ఆమె అంత పని చేసింది..!

Thief Woman : పరిచయంతో అతనికి స్నేహితురాలైంది .. ఫ్రెండ్‌షిప్‌తో ఇంట్లో చేరి ఆమె అంత పని చేసింది..!

Thief Woman

Thief Woman

Thief Woman: ముక్కు , మొహం తెలియని వాళ్లను స్నేహితులుగా ఆదరిస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో పాలమూరు జిల్లాలో జరిగిన ఓ సంఘటన ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగిస్తుంది. ఆడ మనిషి కదా అని నమ్మకంగా ఇంట్లో ఆశ్రయం కల్పిస్తే మూడ్రోజుల్లోనే తన బుద్ధి బయటపెట్టకుంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar, India

  (Syed Rafi, News18,Mahabubnagar)

  ముక్కు , మొహం తెలియని వాళ్లను స్నేహితులుగా ఆదరిస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో మహబూబ్‌నగర్ (Mahabubnagar)జిల్లాలో జరిగిన ఓ సంఘటన ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగిస్తుంది. ఆడ మనిషి కదా అని నమ్మకంగా ఇంట్లో ఆశ్రయం కల్పిస్తే మూడ్రోజుల్లోనే తన బుద్ధి బయటపెట్టకుంది. అపరిచితురాలు ఇచ్చిన షాక్‌కి మైండ్ బ్లాక్ అయిన బాధితులు పోలీసు(Police)లను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. ఈ మోసం జరిగిన తీరును పోలీసులు సీన్‌ టు సీన్‌ వివరించారు.

  Crime news : డబుల్ బెడ్రూం ఇళ్లిప్పిస్తామని డబ్బులు వసూలు .. మోసం చేసిన వాళ్లెవరో కాదు..

  ఆశ్రయం ఇచ్చినందుకు ..

  మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని దొడ్లోనిపల్లికి చెందిన నరేష్ తన మిత్రుడు పండ్ల శేఖర్‌తో కలిసి ఆటోలో ఏప్రిల్ హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ కు వస్తున్నారు. దారి మధ్యలో రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ దగ్గర ఒక మహిళ ద్విచక్ర వాహనంతో నిలబడి ఉంది. వారిద్దరూ ఆమె వివరాలు తెలుసుకోగా తన వాహనం చెడిపోయిందని చెప్పడంతో ఆమెను వాహనాన్ని ఆటోలో ఎక్కించుకొని మహబూబ్‌నగర్ తీసుకొచ్చారు. తన పేరు నాగమణి అలియాస్ జానుగా చెప్పింది. ఆ రోజు రాత్రి ఆమెకు తన ఇంట్లోనే వసతి కల్పించారు. మరుసటి రోజు ఆమె సొంతూరు అన్నమయ్య జిల్లా రాజంపేటకు పంపించారు.

  స్నేహితురాలు కాదు మాయలేడీ..

  పాలమూరు జిల్లా నుంచి వెళ్లిన తర్వాత సదరు మహిళ తరచూ సహాయం చేసిన ఇద్దరిలో ఒకరైన నరేష్‌తో ఫోన్‌లో మాట్లాడేది. ఆ పరిచయంతోనే ఈ ఏడాది ఆగస్టు 24న పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష రాయడానికి మహబూబ్‌నగర్ కు వచ్చి నరేష్ ఇంట్లోనే ఉంది. అదే నెల 28న నరేష్ తన భార్యతో కలిసి యాదాద్రిలోని వసతి గృహంలో చదువుకుంటున్న పిల్లల దగ్గరకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలతో పాటు పది వేల రూపాయల నగదు, 20 తులాల వెండి పట్టీలు తీసుకొని ఇంట్లోంచి మాయమైపోయింది.

  Accident : ఆటోని ఢీకొట్టిన TS RTC ఎండీ కారు .. యాక్సిడెంట్‌లో సజ్జనార్‌తో పాటు ఐదుగురికి గాయాలు

  మూడ్రోజుల్లో ఇంట్లో నగలు మాయం..

  అదే రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన నరేష్ చోరీ జరిగిందని నిర్ధారించుకున్నారు. వెంటనే పోలీస్ స్టేషన్‌లో నాగమణి పై ఫిర్యాదు చేశారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని మెట్టుగడ్డ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా ఆమెను పోలీసులు పట్టుకున్నారు పోలీసులు. నాగమణి అలియాస్ జాను దగ్గర నుంచి నాలుగున్నర తులాల బంగారంతో పాటు స్కూటీ, సెల్‌ఫోనును స్వాధీనం చేసుకున్నారు. నాగమణిపై గతంలో కడప జిల్లా సిద్ధవటం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చోరీ కేసు నమోదైందని గ్రామీణ సీఐ రాజేశ్వర్ గౌడ్ తెలిపారు. దొంగ మహిళను రిమాండ్ కి తరలించారు. నట్లు ఆయన తెలిపారు. స్నేహితురాలిగా వచ్చి మూడు రోజులు ఇంట్లో ఉండి ...నాలుగున్నర తులాల బంగారాన్ని చోరీ చేసిన ఇలాంటి ఖతర్నార్ మహిళల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Fraud women, Mahbubnagar, Telangana crime news

  ఉత్తమ కథలు