• HOME
 • »
 • NEWS
 • »
 • CRIME
 • »
 • MAHABUBNAGAR POLICE ARREST HUSBAND AND WIFE FOR KILLING WOMEN BA

ఒంటరిగా కల్లు తాగే మహిళలే వాడి టార్గెట్...

ఒంటరిగా కల్లు తాగే మహిళలే వాడి టార్గెట్...

నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన మహబూబ్‌నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి

మహిళల ఆభరణాలకోసం హత్యలు చేసే ఓ హంతకుడిని మహబూబ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు.

 • Share this:
  ఒంటరిగా కల్లు తాగే మహిళలే వాడి టార్గెట్...మాటల్లో దింపి మత్తు చేసి హత్య చేసి నగలు దోచేకెళ్లడమే వాడి అలవాటు. మహిళల ఆభరణాలకోసం హత్యలు చేసే ఓ హంతకుడిని మహబూబ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి వివరాలు వెల్లడించారు. పట్టణ కేంద్రంలోని శివశక్తి నగర్ లో నివాసముంటున్న ఎరుకలి శ్రీను అనే వ్యక్తి.. ఈ నెల 16న స్థానిక తిరుమలదేవుడి గుట్టలో ఉన్న కల్లు దుకాణంలో కూచూర్ గ్రామానికి చెందిన అలివేలమ్మ అనే 53ఏళ్ల మహిళ ఒంటిపైనున్న నగలను దోచుకోవాలని పథకం పన్నాడు. అనంతరం ఆవిడను మాటల్లో దింపి పరిచయం చేసుకున్నాడు. మాయమాటలు చెప్పి సదురు మహిళను దేవరకద్ర మండలం డోకూర్ గ్రామ శివారు కి తీసుకువెళ్లి మద్యం త్రాగించి హత్య చేశాడు. ఆ తర్వాత ఒంటిపై ఉన్న బంగారు, వెండి నగలను దోచుకున్నాడు. ఈ హత్య పై దర్యాప్తు చేసిన పోలీసులు ఎరుకలి శ్రీనును.. అతడికి సహకరించిన భార్య సాలెమ్మను కూడా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. లక్షా ఐదువేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇదే కాకుండా ఇంకా మూడు హత్యకేసుల్లో ఎరుకలి శ్రీను నిందితుడు గా గుర్తించామని ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు. మహిళల ఆభరణాల కోసమే హత్యలు చేసే వాడని అమాయకంగా ఉండే ఒంటరి మహిళలే టార్గెట్ గా ఎంచుకొని నేరాలకు పాల్పడే వారని ఎస్పీ రేమారాజేశ్వరి వివరించారు. ఈ సందర్భంగా ఎవరన్నా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే 100 కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  అగ్ర కథనాలు