హోమ్ /వార్తలు /క్రైమ్ /

షాద్‌నగర్ ఎన్‌కౌంటర్... అలిగి వెళ్లిపోయిన పోస్టుమార్టం డాక్టర్లు

షాద్‌నగర్ ఎన్‌కౌంటర్... అలిగి వెళ్లిపోయిన పోస్టుమార్టం డాక్టర్లు

నిందితులకు పోస్టుమార్టం చేసేందుకు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి ప్రత్యేకంగా డాక్టర్ల బృందం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు.

    షాద్‌నగర్ ఎన్‌కౌంటర్ నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం విషయంపై ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. నిందితులకు పోస్టుమార్టం చేసేందుకు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి ప్రత్యేకంగా డాక్టర్ల బృందం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి చెందిన ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ హెచ్‌ఓడీ కృపాల్‌సింగ్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ లావణ్య, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మహేందర్, మరో ఇద్దరు పీజీ విద్యార్థులతో కూడిన ప్రత్యేక బృందం.. ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించింది.

    శుక్రవారం సాయంత్రం 4.51 గంటలకు ప్రారంభమైన శవపరీక్ష ప్రక్రియ రాత్రి 9 గంటలకు పూర్తయింది. ఒక్కో మృతదేహాన్ని నిశితంగా పరిశీలించిన ఫోరెన్సిక్‌ నిపుణులు.. వారి బరువు, ఎత్తు కొలిచారు. ఏ భాగంలో బుల్లెట్‌ గాయమైంది? ఏ తుపాకీతో, ఎంత దూరం నుంచి కాల్చి చంపారు? అనే విషయాలను నిశితంగా పరిశీలించారు. అయితే గాంధీ ఆస్పత్రి వైద్యులతో పోస్టుమార్టం పూర్తి చేయడంతో... మహబూబ్ నగర్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం వచ్చే ఇతర డాక్టర్లు అలిగారు. ఆస్పత్రిలో ఉన్న మిగతా కేసుల్లో మృతదేహాలకు పోస్టుమార్టం చేయమని వెనుతిరిగారు. గాంధీ ఆస్పత్రి వైద్యులనే పిలిపించుకొని ఇక నుంచి పోస్టుమార్టం నిర్వహించుకుండంటూ... అక్కడకి వచ్చే ప్రభుత్వ వైద్యులు అలిగి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

    First published:

    Tags: Disha murder case, Shadnagar, Shadnagar encounter, Shadnagar rape, Telangana

    ఉత్తమ కథలు