• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MAHABUBNAGAR ACCIDENT 14 KILLED AND TWO MORE INJURED BA

మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం.. 14 మంది దుర్మరణం

మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం.. 14 మంది దుర్మరణం

మహబూబ్‌నగర్ జిల్లాలో ఆటోను ఢీకొట్టిన లారీ

ఘటనలో చనిపోయిన వారంతా ఒకే గ్రామానికి చెందిన వారు. అందులో మహిళలే ఎక్కువ మంది ఉన్నారు.

  • Share this:
    మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రం శివారులో ఈ ప్రమాదం జరిగింది. కొత్తపల్లి గ్రామానికి చెందిన కూలీలు శివారులోని వ్యవసాయ పొలాల్లో పనిచేసి తిరుగు ప్రయాణంలో ఆటోలో గ్రామానికి వస్తుండగా కోదాడ వైపు వెళ్తున్న లారీ ఆటో ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది అక్కడిక్కడే చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా, అందులో మరో ఇద్దరు మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపడుతున్నారు.. ఒకే గ్రామానికి చెందిన వారు చనిపోవడంతో ఆ గ్రామంలో లో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్.. హుటాహుటిన హైదరాబాద్ నుంచి ఘటన స్థలానికి బయలుదేరారు.

    మరోవైపు మిడ్జిల్ మండల రాణిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం బాధితుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పద్మజారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల కోశాధికారి కృష్ణావర్ధన్ రెడ్డి, యువ మోర్చా నాయకులు రామ్మోహన్, తిరుపతి తదితరులు బాధితుల కుటుంబ సభ్యులు చేస్తున్న ఆందోళన చేపట్టారు
    Published by:Ashok Kumar Bonepalli
    First published: