కిడ్నాప్ చేసిన గంటన్నరలోపే దీక్షిత్‌ హత్య.. వివరాలు వెల్లడించిన ఎస్పీ

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కిడ్నాప్‌కు గురైయిన దీక్షిత్‌రెడ్డిని దుండగులు హత్య చేసిన సంగతి తెలిసిందే. కేసముద్రం మండలం అన్నారు శివారులోని గుట్టల్లో దీక్షిత్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.

news18-telugu
Updated: October 22, 2020, 12:58 PM IST
కిడ్నాప్ చేసిన గంటన్నరలోపే దీక్షిత్‌ హత్య.. వివరాలు వెల్లడించిన ఎస్పీ
దీక్షిత్(ఫైల్ ఫొటో)
  • Share this:
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కిడ్నాప్‌కు గురైయిన దీక్షిత్‌రెడ్డిని దుండగులు హత్య చేసిన సంగతి తెలిసిందే. కేసముద్రం మండలం అన్నారు శివారులోని గుట్టల్లో దీక్షిత్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. దీంతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ కోటిరెడ్డి గురువారం మీడియాకు వెల్లడించారు. కిడ్నాపర్ బాలుడి గొంతు నులిమి హత్య చేసినట్టుగా తెలిపారు. అయితే నిందితుడి ఎన్‌కౌంటర్ చేయలేదని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. "మహబూబాబాద్‌ పట్టణానికి చెందిన రంజిత్‌ రెడ్డి ఓ టీవీ చానల్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆయన పెద్ద కుమారుడు దీక్షిత్‌ రెడ్డి(9)ని బైక్‌పై వచ్చిన మందసాగర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసేందుకు ముందుగానే రెక్కీ నిర్వహించి సీసీ కెమెరాల్లో ఎక్కడ దొరక్కుండా జాగ్రత్త పడ్డాడు. నిందితుడిగా మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. దీక్షిత్ ఇంటికి సమీపంలోనే అతను నివాసం ఉంటున్నాడు.

అయితే మహబూబాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద ఉన్న సీసీ కెమెరాలో మందసాగర్‌ బైక్‌పై దీక్షిత్‌ను తీసుకెళ్లిన దృశ్యాలు రికార్డయ్యయాయి. డబ్బు కోసమే మందసాగర్ దీక్షిత్‌ను కిడ్నాప్ చేశాడు. అయితే బాలుడిని అదుపు చేయడం కష్టంగా మారడం, దొరికిపోతాననే భయంతో గొంతునులిమి చంపేశాడు. కిడ్నాప్ చేసిన గంటన్నరలోపే బాలుడిని హత్య చేశాడు. ఆ తర్వాత అన్నారం శివారులోని గుట్టలోకి తీసుకెళ్లి మృతదేహాన్ని పెట్రోలు పోసి కాల్చేశాడు. బాలుడిని హత్య చేసిన విషయం దాచిపెట్టి అతడి తల్లిదండ్రులను రూ. 45 లక్షలు డిమాండ్ చేశాడు. ఆ తర్వాత రెండు రోజులు కూడా బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. నిందితులు ఇంటర్నెట్ కాల్స్ చేసి తప్పించుకుందామని చూశాడు.

అయితే సాంకేతికత సాయంతో అతన్ని పట్టుకున్నాం. బాలుడిని కిడ్నాప్ చేసిన మందసాగర్‌తో పాటు మనోజ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నాం. ఇందులో మనోజ్‌రెడ్డి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నాం. నిందితుడిని ఎన్‌కౌంటర్ జరగలేదు. దర్యాప్తు అనంతరం నేడు సాయంత్రం గానీ, రేపు ఉదయం గానీ పూర్తి వివరాలు వెల్లడిస్తాం" అని తెలిపారు. నిందితుడిని పూర్తిగా విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశం ఉందన్నారు.
Published by: Sumanth Kanukula
First published: October 22, 2020, 12:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading