Mahabubabad Kidnap Case: దీక్షిత్‌ను హత్య చేసిన కిడ్నాపర్లను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు?

మానుకోటలో కిడ్నాప్ అయిన దీక్షిత్ కథ విషాదాంతమైన సంగతి తెలిసిందే. ఐదుగురు రోజుల క్రితం బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగులు.. అతని ప్రాణాలు తీశారు.

news18-telugu
Updated: October 22, 2020, 11:43 AM IST
Mahabubabad Kidnap Case: దీక్షిత్‌ను హత్య చేసిన కిడ్నాపర్లను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు?
దీక్షిత్(ఫైల్ ఫొటో)
  • Share this:
మానుకోటలో కిడ్నాప్ అయిన దీక్షిత్ కథ విషాదాంతమైన సంగతి తెలిసిందే. ఐదుగురు రోజుల క్రితం బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగులు.. అతని ప్రాణాలు తీశారు. కేసముద్రం మండలం అన్నారం శివారు ప్రాంతాల్లోని గుట్టలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే బాలుడి ఆచూకీ కోసం నాలుగు రోజులుగా పోలీసులు తీవ్రంగా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే బాలుడిని హత్య చేసిన కిడ్నాపర్లను కూడా పోలీసులు హతమార్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. డ్నాపర్లు మనోజ్‌రెడ్డి, మందసాగర్‌ను పోలీసులు కాల్చిచంపినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. బాలుడి మృతదేహం లభించిన గుట్టల్లోనే కిడ్నాపర్లను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇక, మహబూబాబాద్ లో కృష్ణ కాలనీలో ఉంటున్న రంజిత్.. ఓ ప్రముఖ టీవీ చానల్‌లో వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. రంజిత్, వసంతల పెద్ద కుమారుడు దీక్షిత్‌రెడ్డి(9). ఆదివారం రోజున బైక్ వచ్చిన ఓ వ్యక్తి బాలుడిని ఎత్తికెళ్లాడు. ఎంతసేపటికి దీక్షిత్ జాడ తెలియకపోవడంతో అతడి తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. కానీ అతడు కనిపించలేదు. తోటివారిని ఆరా తీయగా.. బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి దీక్షిత్‌ను తీసుకునివెళ్లాడని వాళ్లు చెప్పారు. ఇక, రాత్రి 10 గంటలకు కిడ్నాపర్లు బాలుడి తల్లికి ఫోన్ చేసి రూ. 45 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తేనే బాలుడిని విడిచిపెడతామని కిడ్నాపర్లు చెప్పారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని హెచ్చరించారు. పోలీసులకు చెప్పినా పిల్లాడిని చంపేస్తామని బెదిరించారు.

అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాలుడి ఆచూకీ కోసం ప్రయత్నించారు. మరోవైపు డబ్బివ్వడానికి రెడీ గా ఉన్నానని చెప్పిన దీక్షిత్ తండ్రి.. కిడ్నాపర్లు సూచించిన ప్రాంతానికి వస్తానని చెప్పాడు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కిడ్నాపర్లు చెప్పిన స్పాట్ కు వెళ్లాడు. వాళ్లు చెప్పిన దగ్గర డబ్బుల బ్యాగ్ పెట్టి వచ్చాడు.
Published by: Sumanth Kanukula
First published: October 22, 2020, 11:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading