news18-telugu
Updated: November 16, 2020, 8:46 PM IST
ప్రతీకాత్మక చిత్రం
దేశంలో దారుణాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఆస్తుల కోసం కొందరు, క్షక్షల నేపథ్యంలో మరి కొందరు ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. కిరాతకంగా ప్రాణాలు తీసి బాధిత కుటుంబాలకు తీరని శోకం మిగుల్చుతున్నారు. నిత్యం ఎక్కడో చోట ఇలాంటి దారుణాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ ముఠా వ్యక్తిని దారుణంగా హత్య చేసింది. అంతటితో ఆగకుండా అతడి తలను చర్చి వద్దకు విసిరేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ దృశ్యాలు కొందరు తమ ఫోన్లలో రికార్డు చేయడంతో వైరల్ గా మారాయి.
వివరాలు పరిశీలిస్తే.. ఊతంగడికి సమీపంలోని సోలైయప్పన్ నగర్ కు చెందిన బీ మురుగనంతం(22) తన స్నేహితుడు మునిసామితో కలిసి బయటకు వెళ్లాడు. స్థానిక చర్చి వద్ద వీరు నడుచుకుంటూ వెళ్తుండగా కారులో వచ్చిన కొందరు దుండగులు వీరిని అడ్డగించారు. దీంతో మురుగానందం పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయినా ఆ ముఠా ఆగలేదు. అతడిని ఆ దుండగులు వెంబడించి మరీ దారుణంగా హత్య చేశారు. మురుగానందం తలను నరికి సమీపంలోని చర్చి ముందు విసిరేశారు.
ఆ దుండగులు చేసిన దాడిలో మురుగానందం స్నేహితుడు సైతం గాయపడ్డాడు. అతడిని రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంతో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చాలా రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఇలాంటి దారుణ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. పాత వివాదాలు, కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగిందా? లేక ఈ హత్య వెనుక ఇంకా ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Published by:
Nikhil Kumar S
First published:
November 16, 2020, 8:41 PM IST