Home /News /crime /

MADURAI DISTRICT POLICE FILED CASE AGAINST YOUTUBER TIKTOK FAME SURIYA DEVI SU

Suriya Devi: TikTok స్టార్ సూర్య దేవిపై కేసు నమోదు చేసిన పోలీసులు..

TikTok స్టార్ సూర్య కుమారిపై కేసు నమోదు చేసిన పోలీసులు..

TikTok స్టార్ సూర్య కుమారిపై కేసు నమోదు చేసిన పోలీసులు..

కరోనా వైరస్ పేరు చెబితేనే చాలా మంది భయపడిపోతున్నారు. గత ఏడాదిన్నర కాలంగా కరోనా వైరస్ దేశంలో ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది.

    కరోనా వైరస్ పేరు చెబితేనే చాలా మంది భయపడిపోతున్నారు. గత ఏడాదిన్నర కాలంగా కరోనా వైరస్ దేశంలో ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. ఇప్పుడు థర్డ్ వేవ్‌కు సంబంధించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో ప్రజల్లో కరోనాకు సంబంధించి చాలా భయాందోళనలు ఉన్నాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కూడా కొందరు వేరే లోకంలో బతికేస్తున్నారు. సోషల్ మీడియాలో తమకు సంబంధించి వీడియోలను పోస్ట్ చేసి.. అవి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. వాటికి ఎక్కువ వ్యూస్‌ తెచ్చుకోవడం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే టిక్‌టాక్‌పై నిషేధం విధించిన తర్వాత.. దాని ద్వారా ఫేమ్ పొందిన చాలా మంది యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ బాట పట్టారు.

    అయితే కొందరు సోషల్ మీడియాలో పాపులారిటీ కోసమని జనాలను భయబ్రాంతులకు గురిచేసేవి, ప్రాంక్ వీడియోలు.. ఇలా ఇతరులను ఇబ్బంది పెట్టే వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా టిక్‌టాక్‌ స్టార్ సూర్య దేవిపై మధురై సుబ్రమణ్యపురం మార్కెట్ ప్రాంతానికి చెందిన సికందర్ అనే వ్యక్తి ఈ నెల 2వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తనపై దాడి చేసి చంపుతానని బెదిరించినట్టుగా చెప్పాడు. దీంతో సుబ్రహ్మణ్యపురం పోలీసులు సూర్య దేవిపై కేసు నమోదు చేశారు.

    ఇక, టిక్‌టాక్‌లో పేరు పొందిన కొందరు అడ్డదారుల్లో డబ్బు సంపాదించడం కోసం ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అడ్డమైన వీడియోలను పోస్ట్ చేస్తున్నారని, వీటి ద్వారా పిల్లలు తప్పుదోవ పట్టే అవకాశం ఉందని కొందరు వాదిస్తున్నారు. అందుకే వారి ఆదాయం కోసం సోషల్ మీడియాను చెడుగా వాడుకునే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Tamil nadu, Tiktok

    తదుపరి వార్తలు