కుటుంబ పెద్ద మృతితో డిప్రెషన్ లోకి.. ప్రాణాలు తీసుకున్న భార్య, ఇద్దరు కూతుళ్లు.. కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్

ఫ్రతీకాత్మక చిత్రం

Madurai: ఆ కుటుంబ పెద్ద మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. నెలలు గడుస్తున్నా వారు ఆ డిప్రెషన్ లో నుంచి బయటకు రాలేక పోయారు. భర్త లేకుండా తాను బతకలేనని ఆ భార్య, ప్రాణంగా పెంచిన తమ తండ్రి లేకుండా తాము జీవించలేమని ఆ కూతుళ్లు భావించారు. దీంతో ఆ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 • Share this:
  ఆ కుటుంబ పెద్ద మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. నెలలు గడుస్తున్నా వారు ఆ డిప్రెషన్ లో నుంచి బయటకు రాలేక పోయారు. భర్త లేకుండా తాను బతకలేనని ఆ భార్య, ప్రాణంగా పెంచిన తమ తండ్రి లేకుండా తాము జీవించలేమని ఆ కూతుళ్లు భావించారు. దీంతో ఆ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన తమిళనాడులోని మదురైలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. తిరుచ్చిలోని సత్యమూర్తినగర్‌కు చెందిన అరుణ్‌పాండియన్‌(44) కాంట్రాక్టర్‌ గా పని చేసేవాడు. పాండియన్ కు భార్య వలర్మతి(38), కుమార్తెలు అఖిల(19), ప్రీతి(17) ఉన్నారు. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో అరుణ్‌పాండియన్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనకు మెరుగైన చికిత్స అందించడం కోసం ఆ కుటుంబం మదురైకి వచ్చింది. అక్కడ వారి బంధువుల ఇంటిలోని పై అంతస్తులో నివాసం ఉంటూ పాండియన్ కు చికిత్స చేయించారు.

  అయితే అనారోగ్యానికి గురైన పాండియన్ కోలుకోలేదు. ఈ క్రమంలో జూలైలో కన్నుమూశాడు. అయితే పాండియన్ మరణాన్ని అతని కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. దీంతో వారు తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి వారు పాండియన్ భార్య వలర్మతి, కుమార్తెలు అఖిల, ప్రీతి ముగ్గురు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. తాము చనిపోతే తమ కుక్క పరిస్థితి ఏంటని అనుకున్నారో ఏమో దాని ప్రాణాలు కూడా తీశారు. ఆ కుక్కను గొంతు నులిమి ప్రాణాలు తీశారు. అయితే సోమవారం ఉదయం ఎంతసేపైనా వలర్మతి, ఆమె పిల్లలు బయటకు రాకపోవడంతో ఆ ఇంటి యజమాని అనుమానం వచ్చి పోలీసులు ఫోన్ చేశారు.

  దీంతో వారు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ఆ ముగ్గురు ఉరికి వేలాడుతూ కనిపించారు. అయితే వారి ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ వారు ఓ సూసైడ్ నోట్ రాశారు. ప్రాణానికి ప్రాణంగా పెంచిన తమ తండ్రి చనిపోవడాన్ని తట్టుకోలేక పోతున్నామని.. అందుకే తమ నాన్న వద్దకే వెళ్తున్నామని పాండియన్ ఇద్దరు కూతుళ్లు సూసైడ్ లెటర్ లో రాయడాన్ని చూసిన కుటుంబ సభ్యులు, బంధువుల కన్నీటి పర్యంతం అయ్యారు. తమ అంత్యక్రియలను తల్లి లక్ష్మి చేతుల మీదుగా చేయించాలని.. తమతో శవాలతో పాతు తమ కుక్క అంత్యక్రియలను సైతం చేయాలని వలర్మతి లేఖలో కోరారు.
  Published by:Nikhil Kumar S
  First published: