కాంపౌండ్ వాల్ ఎక్కిన ఖైదీలు... జైలు సిబ్బందిపై రాళ్ల దాడి

కొందరు ఖైదీలు కాంపౌడ్ వాల్ ఎక్కి దూకేస్తామని బెదిరించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా మదురై సెంట్రల్ జైల్లో ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది.

news18-telugu
Updated: April 24, 2019, 9:21 AM IST
కాంపౌండ్ వాల్ ఎక్కిన ఖైదీలు... జైలు సిబ్బందిపై రాళ్ల దాడి
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 24, 2019, 9:21 AM IST
తమిళనాడులోని మదురై సెంట్రల్ జైల్లో ఖైదీలు రెచ్చిపోయారు. అర్థరాత్రి జైలు బ్యారక్‌ల నుంచి బయటకు వచ్చిన నేరస్తులు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. జైలు కాంపౌండ్ ఎక్కి కొందరు హల్ చల్ చేశారు. తనిఖీల పేరుతో అధికారులు తమను వేధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైదీలో రాళ్లదాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కొందరు ఖైదీలు కాంపౌడ్ వాల్ ఎక్కి దూకేస్తామని బెదిరించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా మదురై సెంట్రల్ జైల్లో ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. జైలు సిబ్బంది తమను ఇబ్బందులు పెడుతున్నారంటూ ఖైదీలు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఈ గొడవ మరింత ముదిరింది. దీంతో అర్థరాత్రి జైలు అధికారులకు, ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో జైలు సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంత సమస్యను వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది

First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...