Home /News /crime /

MADRAS HIGH COURT ORDERED TO GIVE COUNSELLING FOR PARENTS OF TWO GIRLS WHO ARE IN LIVE IN RELATIONSHIP HSN GH

20 ఏళ్ల అమ్మాయితో 22 ఏళ్ల యువతి సహజీవనం.. కోర్టు మెట్లెక్కిన వారి తల్లిదండ్రులకు మైండ్ బ్లాకయ్యే తీర్పు.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

22 ఏళ్ల ఓ యువతి 20 ఏళ్ల అమ్మాయితో సహజీవనం చేస్తోంది. ఇద్దరూ మొదట్లో స్నేహితులే అయినా, ఆ తర్వాతే వారి మధ్య ప్రేమ చిగురించింది. అయితే వీళ్ల బంధాన్ని వ్యతిరేకిస్తూ వారి తల్లిదండ్రులు కోర్టు మెట్లెక్కితే..

ప్రపంచం కొత్త ప‌ద్ధతుల్ని ఆహ్వానించాల్సిందే! అందుకే `మార్పు అనేది అనివార్యం‌` అన్నారు పెద్ద‌లు, అందుకే `మార్పు మంచిదే!` దాన్ని ఒప్పుకోమంటున్నారు ఆ న్యాయమూర్తి. త‌మిళ‌నాడులో ఓ ప్రత్యేకమైన కేసు విష‌యంలో మ‌ద్రాస్ హైకోర్టు తెలివైన తీర్పును ప్ర‌క‌టించింది. వివాదానికి కార‌ణ‌మ‌యిన ఇద్ద‌ర‌మ్మాయిల త‌ల్లిదండ్రుల‌ను కౌన్సిలింగ్ తీసుకొని, తెలివిగా న‌డుచుకోమ‌ని ఉప‌దేశించింది. తీర్పును ప్ర‌క‌టించిన జ‌స్టిస్‌ ఎన్ ఆనంద్ వెంక‌టేష్ ఈ కేసు విష‌యంలో ప‌ర్స‌న‌ల్‌గా రీసెర్చ్ చేసి మ‌రీ త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌డం అంద‌ర్నీ ఆక‌ర్షించింది.ప్ర‌స్తుతం మ‌న‌కు కావాల్సింది మ‌న‌ముందు ఉన్న ఈ స‌మ‌స్య‌ను అర్థం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం, అందుకే ఈ విష‌యంలో ఇద్ద‌రి త‌ర‌పువారూ శాంతియుతంగా ఆలోచించి, నిర్ణ‌యం తీసుకోవ‌డం చాలా అవ‌స‌ర‌మ‌ని జ‌స్టిస్ ఆనంద్ ఈ సంద‌ర్భంగా హిత‌వు ప‌లికారు. ఇద్ద‌రు అమ్మాయిలు త‌మ‌కు భ‌ద్ర‌త కావాల‌ని వేసిన పిటీష‌న్‌పై సానుకూలంగా స్పందించిన కోర్టు త‌మ త‌ల్లిదండ్రుల నుంచి ఈ అమ్మాయిల స‌హ‌జీవ‌నానికి ఎలాంటి ఆటంకం జ‌ర‌గ‌కూడ‌ద‌ని ఆదేశించింది.

త‌మిళ‌నాడులోని మ‌‌ధురై జిల్లాకు చెందిన ఇద్ద‌రు యువ‌తులు గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా స‌హ‌జీవ‌నం ( Living together) చేస్తున్నారు. మొద‌ట స్నేహితులుగా ఉన్న 22 ఏళ్ల ఎంబిఏ విద్యార్థినీ, 20 ఏళ్లున్న డిగ్రీ విద్యార్థిని త‌మ సంబంధం కొంత కాలం త‌ర్వాత ప్రేమ‌గా మారింద‌ని, త‌మ బంధంపై ఇద్ద‌రికీ క్లారిటీ ఉంద‌ని, జీవితాంతం పార్ట‌న‌ర్స్‌గా ఉండిపోతామ‌ని కోర్టు ఎదుట త‌మ అభిప్రాయాన్ని స్ప‌ష్టం చేశారు. అయితే వీరి బంధానికి వీరి తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఇద్ద‌ర్నీ విడ‌దీయ‌డానికి నానా ప్ర‌య‌త్నాలూ చేశారు. దూరంగా ఉండ‌ండంటూ బ‌ల‌వంతం చేశారు. దీనితో ఇద్ద‌రు యువ‌తులూ మ‌ధురై నుంచి దూరంగా వెళ్లిపోయి, ఒక ఎన్‌జీఓ ర‌క్ష‌ణ‌లో ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ హాస్టల్లో ఘోరం.. నాన్నా.. నన్ను క్షమించు.. అన్నా.. నేను తప్పు చేయలేదురా అంటూ.. మెసేజ్ పెట్టి మరీ..

ఈ కేసులో మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసిన జ‌డ్జి, ముందుగా ఈ అంశంపైన ప‌ర్స‌న‌ల్‌గా స‌మ‌యాన్ని కేటాయించి ప‌‌రిశోధ‌న చేశాన‌ని చెప్పారు. ఈ బంధాన్ని అర్థం చేసుకోవ‌డానికి వివిధ ర‌కాల మెటీరియ‌ల్‌ను సేక‌రించిన త‌ర్వాత, ఒక అవ‌గాహ‌న‌తో తీర్పు ఇస్తున్న‌ట్లు చెప్పారు. ఈ మ‌ధ్య‌ంత‌ర ఆర్డ‌ర్ కాపీతో పాటు ఆయ‌న ప‌రిశోధ‌న చేసిన ప్ర‌తుల‌న్నింటినీ జ‌త చేసిన జ‌డ్జిని అందరూ ప్ర‌శంసించారు. త‌ల్లిదండ్రుల‌కు ఈ విష‌యంపై సానుకూల‌మైన అవ‌గాహ‌న క‌ల్పించ‌డం కోసం ప్ర‌ఖ్యాత సైకాల‌జిస్టు విద్యా దిన‌క‌ర‌న్‌ను యువ‌త‌లు పేరెంట్స్‌కు కౌన్సెలింగ్ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. దీనిపై ఏప్రిల్ నెల 26 తారీఖున రిపోర్టు స‌బ్ మిట్ చేయాల‌ని చెప్పారు.
ఇది కూడా చదవండి: మేడమీద గదిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. అర్ధరాత్రి అక్క అదృశ్యం.. తల్లిదండ్రులతో కలిసి ఆమె కోసం వెతుక్కుంటూ వెళ్తే..

దీనిపై తీర్పు ఇస్తూ జ‌‌స్టిస్ ఆనంద్ కూడా ఎంతో నిజాయితీగా వ్య‌వ‌హ‌రించార‌ని అర్థ‌మ‌య్యింది. ఆయ‌న మాట్లాడుతూ `నిజానికి, ఈ అంశంపైనా నాలో అంత‌కుముందు ఉన్న ఆలోచ‌న‌లు బ్రేక్ చేశాను. ముందుగా నాకున్న అభిప్రాయాలను పక్కన పెట్టి.. నిజాయితీగా పిటీష‌నర్లైన యువ‌తులు, వారి త‌ల్లిదండ్రుల వాద‌న‌లు ప‌రిగ‌ణ‌నలోకి తీసుకున్నాను. త‌ర్వాతే ఈ కేసు విష‌యంలో స‌వివ‌రంగా తీర్పు రాశాను` అన్నారు. `ఇలా కాకుండా, ఈ స‌మ‌యంలో నా వ్యక్తిగత ఆలోచ‌న‌ల‌ను పాటించి, వేరే విధంగా చేయాల‌నుకుంటే నేను క‌ప‌టిగానే మిగిలిపోయేవాడిని. అత్యంత ముఖ్య‌మైన ఈ విష‌యంలో నాలో ఉన్న నిజ‌మైన ‌, నిజా‌యితీగ‌ల అభిప్రాయాన్ని వెల్ల‌డించ‌లేక‌పోయేవాడిని` అన్నారు జ‌స్టిస్ ఆనంద్‌.
ఇది కూడా చదవండి: బీటెక్ కుర్రాడు.. డిగ్రీ యువతి.. రాత్రి 10.30గంటల సమయంలో పాల ప్యాకెట్ తీసుకొస్తానంటూ ఆ యువతి బయటకు వచ్చి..
First published:

Tags: Crime news, Crime story, CYBER CRIME, Illegal affairs, Love affair, Tamil nadu

తదుపరి వార్తలు