• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • MADHYA PRADESH WOMAN SEXUALLY ASSAULTS 16 YEAR OLD BOY THREATEN TO FILE FALSE CASE SU

అబ్బాయిని లైంగికంగా వేధించిన మహిళ.. డబ్బులు ఇవ్వాలని అతడి కుటుంబంపై ఒత్తిడి.. ఫ్యామిలీ సపోర్ట్‌తోనే..

ప్రతీకాత్మక చిత్రం

ఓ 35 ఏళ్ల మహిళ మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడింది. ఆ తర్వాత బాలుడి కుటుంబ సభ్యులపై డబ్బులు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేసింది.

  • Share this:
    ఓ 35 ఏళ్ల మహిళ మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడింది. అతనితో తొలుత స్నేహం చేసిన మహిళ.. ఆ తర్వాత ఈ పని చేసింది. ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తోందని.. బాలుడిని భయపెట్టింది. ఆ తర్వాత ఆ మహిళ కుటుంబ సభ్యులు.. లక్ష రూపాయలు ఇవ్వాలని లేకుండటే బాలుడిని రేప్ కేసులో ఇరికిస్తామని అతడి కుటుంబ సభ్యులను బెదిరించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఓ 35 ఏళ్ల మహిళ అదే గ్రామంలో నివసించే 16 ఏళ్ల బాలుడితో స్నేహం పెంచుకుంది. ఆ తర్వాత అతనిపై లైంగికంగా వేధించింది. రెండు సార్లు లైంగిక వేధింపులకు పాల్పడింది. ఆ తర్వాత మహిళతో పాటు ఆమె భర్త, అత్తమామలు.. బాలుడి కుటుంబంపై డబ్బుల ఇవ్వాలని ఒత్తిడి చేశారు. లేకుంటే బాలుడిని రేప్ కేసులో ఇరికిస్తామని బెదిరించారు. అయితే ఇందుకు బాలుడి కుటుంబం నిరాకరించడంతో మహిళ కుటుంబ సభ్యులు బాలుడి కుటుంబానికి చెందిన తోటలోని చెట్లను ధ్వంసం చేశారు.

    మరోవైపు బాలుడు తనపై జరిగిన లైంగిక దాడి గురించి రాజ్‌ఘర్‌లోని చైల్డ్ లైన్‌కు తెలియజేశారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఈ ఘటనకు సంబంధించి మహిళపై కేసు నమోదు చేశారు. పొక్సో చట్టంతో ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసునమోదు చేశారు. మరోవైపు ఆ మహిళ భర్త, అత్తమామలపై కూడా పోలీసులు ఐపీసీ 384, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

    ఇది చదవండి:  వ్యభిచార కూపంలో ఇద్దరు సినిమా నటీమణులు.. పోలీసులు దాడి చేయడంతో వెలుగులోకి.. ఆ ఆశతో..

    ఇది చదవండి: ఆఫీస్‌లో స్పై కెమెరా.. ఆ వీడియోతో ఓనర్‌ను బ్లాక్‌మెయిల్ చేసిన ఉద్యోగులు.. ఇంతకీ అందులో ఏముంది..?

    ఈ ఘటనకు సంబంధించి అధికారులు స్పందిస్తూ..‘చుట్టుపక్కల వాళ్లు ఎలా చూస్తారనే భయంతో తొలుత బాలుడు ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. కానీ ఆ మహిళ కుటుంబం.. బాలుడి కుటుంబాన్ని వేధింపులకు గురిచేయడంతో ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు’అని తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: