అయ్యో పాపం.. యువతి కళ్లలో యాసిడ్ పోసి చిత్రహింసలు.. ఆ అనుమానంతో దారుణంగా..

ప్రతీకాత్మక చిత్రం

యువతిని ఇద్దరు వ్యక్తులు బుధవారం కిడ్నాప్ చేశారు. యువతితో పాటుగా ఆమె సోదరుడిని అపహరించారు. అనంతరం ఓ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ యువతిపై అత్యాచారం చేసేందుకు యత్నించారు.

 • Share this:
  ప్రేమజంటకు సహకరించిందనే కారణంతో ఓ యువతిని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హింసించారు. ఆమెపై అత్యాచార యత్నం చేశారు. అందుకు ఆమె ప్రతిఘటించడంతో.. ఆమె కళ్లలో యాసిడ్ పోశారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) పన్నా జిల్లా(Panna district) బారాహో గ్రామానికి చెందిన ఓ ప్రేమ జంట ఇటీవల పారిపోయింది. అయితే పారిపోయిన యువతికి సాయం చేసిందనే ఆరోపించిన ఆమె బంధువులు.. అదే గ్రామానికే చెందిన బాధిత యువతితో(20) గొడవకు దిగారు. తమ అమ్మాయి పారిపోయేందుకు బాధిత యువతి సహకరించిందనే పగ పెంచుకున్నారు. ఈ క్రమంలోనే యువతిని ఇద్దరు వ్యక్తులు బుధవారం కిడ్నాప్ చేశారు. యువతితో పాటుగా ఆమె సోదరుడిని అపహరించారు. అనంతరం ఓ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ యువతిపై అత్యాచారం చేసేందుకు యత్నించారు. అందుకు యువతి ప్రతిఘటించడంతో ఆమె రెండు కళ్లలో యాసిడ్(pour acid into eyes) పోశారు. యువతి సోదరుడిని కూడా నిందితులు దారుణంగా కొట్టారు.

  ‘బుధవారం ఇద్దరు నిందితులు బాధిత యువతిని, ఆమె సోదరుడిని కిడ్నాప్ చేశారు. వారు బాధిత యువతి వద్ద నుంచి పారిపోయిన తమ బంధువు గురించి వివరాలు సేకరించేందుకు యత్నించారు. అయితే బాధిత యువతి నుంచి ఎటువంటి సమాచారం అందకపోవడంతో ఆమెపై అత్యాచారం జరపాలని చూశారు. అయితే వారి అత్యాచార ప్రయత్నాన్ని యువతి ప్రతిఘటించడంతో ఆమె కళ్లలో నిందితులు యాసిడ్ పోశారు’అని పోలీసులు తెలిపారు.

  Extramarital Affair: ప్రియుడితో డేటింగ్ చేస్తున్న భార్య.. వారి రాసలీలలు తెలుసుకున్న భర్త.. తర్వాత ఏం జరిగిందంటే..

  ఇద్దరు నిందితులను యువతి గుర్తుపట్టిందని వారిని బుధవారం రాత్రి అరెస్ట్ చేసినట్టుగా జిల్లా ఎస్పీ ధరమ్‌రాజ్ మీనా వెల్లడించారు. నిందితులను సమర్ సింగ్, గోల్డీ రాజాగా గుర్తించినట్టుగా చెప్పారు. అరెస్ట్ అనంతరం వారిని గ్రామంలో అందరి ముందు పరేడ్ నిర్వహించినట్టుగా పోలీసులు తెలిపారు. గురువారం నిందితులను కోర్టులో హాజరపరిచారు. ఇక, బాధిత యువతి ప్రస్తుతం చిత్రకూట్ కంటి ఆస్పత్రిలో ( Chitrakoot Eye Hospital) చికిత్స పొందుతుంది.

  Married Woman: 5 నెలల క్రితం పెళ్లి.. ఆమె జీవితం హ్యాపీగా సాగుతుందని అనుకున్నారు.. కానీ ఇంతలోనే..

  ఈ ఘటనపై బాధితురాలు మాట్లాడుతూ.. ‘గ్రామంలోని ఓ అమ్మాయి.. ఆమె ప్రియుడితో పారిపోవడానికి నేను సాయం చేశాననే అనుమానంతో గ్రామంలోకి కొందరు వ్యక్తులు నన్ను, నా సోదరుడిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేశారు. వేధింపులకు గురిచేశారు. అభ్యంతరం చెప్పడంతో కళ్లలో యాసిడ్ లాంటి రసాయనాన్ని పోశారు. నన్ను, నా సోదరుడిని దారుణంగా కొట్టారు. తర్వాత మమల్ని గ్రామంలో వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు’అని చెప్పారు.
  Published by:Sumanth Kanukula
  First published: