Home /News /crime /

MADHYA PRADESH WOMAN FORCED TO DRINK ACID BY HUSBAND SHE WAS ADMITTED IN DELHI HOSPITAL SK

పుట్టింటి నుంచి కట్నం తేకపోతే చంపేస్తా... భార్యను తీవ్రంగా కొట్టి యాసిడ్ తాగించిన భర్త..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కారు కొనేందుకు రూ.3 లక్షలు కావాలని.. పుట్టింటికి డబ్బులు తేవాలని భార్యను నిత్యం చిత్రహింసలు పెడుతున్నాడు. పెళ్లికే ఎన్నో అప్పులు చేశారని..ఇప్పుడు మళ్లీ అంతా డబ్బు కావాలంలే ఎక్కడి నుంచి తెస్తారని ఆమె ప్రశ్నించింది

    వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరం. వరకట్నం గురించి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి. వరకట్నం తీసుకోవద్దని ప్రచారాలు చేస్తున్నాయి. ఐనా సమాజంలో మార్పు రావడం లేదు. వరకట్నం కోసం మహిళను వేధిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ కట్నం దాహానికి కాపురాలు కూలిపోతున్నాయి. ఎంతో మంది ఆడవారు బలవుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ దారుణం జరిగింది. వరకట్నం కోసం భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్త.. ఆమెతో బలవంతంగా యాసిడ్ తాగించాడు. పుట్టింటి నుంచి అదనపు కట్నం తేకుంటే చంపేస్తానని నరకం చూపించాడు. పోలీసులు చెప్పిన వివరల ప్రకారం.. గ్వాలియర్‌లోని దబ్రాకు చెందిన వీరేంద్ర కుమార్‌కు 5 నెలల క్రితం శశి అనే యువతితో వివాహమైంది. వధువు తల్లిదండ్రులు రూ.10 లక్షలు ఖర్చు పెట్టి ఘనంగా పెళ్లి చేశారు. ఐతే సరిపోలేదని భార్యను వేధిస్తున్నాడు వీరేంద్ర.

    కారు కొనేందుకు రూ.3 లక్షలు కావాలని.. పుట్టింటికి డబ్బులు తేవాలని భార్యను నిత్యం చిత్రహింసలు పెడుతున్నాడు. పెళ్లికే ఎన్నో అప్పులు చేశారని..ఇప్పుడు మళ్లీ అంతా డబ్బు కావాలంలే ఎక్కడి నుంచి తెస్తారని ఆమె ప్రశ్నించింది. ఈ విషయంలో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి గొడవ పెద్దదయింది. నాకే ఎదురు చెబుతావా అంటూ భార్యను కొట్టి కిందపడేశాడు వీరేంద్ర. అనంతరం ఆమెతో బలవంతంగా యాసిడ్ తాగించాడు. యాసిడ్ శరీరం లోపలి భాగాలకు వెళ్లడంతో పలు అవయవాలు దెబ్బతిన్నాయని డాక్టర్లు చెప్పారు. పరిస్థితి విషమించడంతో ఆమెను ఢిల్లీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి భర్తను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఐతే ఈ కేసు దర్యాప్తులో మధ్యప్రదేశ్ పోలీసు తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. జులై 3న ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ బలహీనమైన కేసులు మాత్రమే రాశారని బాధితురాలు బంధువులు ఆరోపిస్తున్నారు.

    జులై 18న శశిని చికిత్స కోసం ఢిల్లీకి తరలించిన తర్వాత..ఆమె సోదరుడు ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు మేరకు DCW టీమ్ ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించింది. ఆమె స్టేట్ మెంట్ కూడా రికార్డు చేశారు. తన భర్త వేరొక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని.. దాని గురించి ప్రశ్నించినందుకు అదనపు కట్నం పేరుతో వేధిస్తున్నాడని తెలిపింది. ఈ వ్యవహారంపై DCW చీఫ్ స్వాతిమాలివాల్ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖరాశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. బాధితురాలి ఫిర్యాదును తేలిగ్గా తీసుకున్న పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. శరీరం లోపలి భాగాలు దెబ్బతిన్నాయి. తరచూ రక్తపు వాంతులు అవుతున్నాయి. ఆమెను కాపాడేందుకు డాక్టర్లు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Crime news, Madhya pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు