Home /News /crime /

MADHYA PRADESH WOMAN FLOGGED WITH BELT PARADED FOR EXTRA MARITAL AFFARI PAH

ముగ్గురు పిల్లల తల్లి.. ప్రియుడితో ఇంట్లో అలా ఉండగా చూసిన భర్త.. ఆ తర్వాత.. వీడియో వైరల్..

మహిళను కొడుతున్న స్థానికులు

మహిళను కొడుతున్న స్థానికులు

Madhya Pradesh: మహిళకు ఇది వరకే ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొన్ని రోజులుగా ఇంట్లో నుంచి చెప్పపెట్టకుండా వెళ్లిపోయింది. ఆమె కోసం భర్త, కుటుంబ సభ్యులు ఊరంతా గాలిస్తున్నారు.

కొంత మంది సమాజంలో నీచంగా ప్రవర్తిస్తున్నారు. పెళ్లయ్యాక వివాహేతర (Extramarital affair)  సంబంధాలు పెట్టుకుంటూ నీచానికి తెగబడుతున్నారు. భర్తకు తెలియకుండా, దొంగ చాటున అడ్డమైన పనులు చేస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తు తమ పరువును, కుటుంబపు పరువును తీసుకుంటున్నారు. పెళ్లైన మహిళలు, వేరే మగళ్లతో ఎఫైర్ లు (love affair)  కొనసాగిస్తున్నారు. కొంత మంది అబ్బాయిలు కూడా, మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు.

గుట్టు చప్పుడు కాకుండా అడ్డమైన పనులు చేస్తున్నారు. కొన్ని సార్లు.. భర్తలు, భార్యలు తాము కట్టుకున్న వారి..  ఎఫైర్ లను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్న అనేక ఘటనలు వార్తలలో చూశాం. ఇలాంటి నీచమైన పనుల వలన సమాజంలో, తలెత్తుకోలేని పరిస్థితికి చేరుకుంటున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు.. మధ్య ప్రదేశ్ లో (Madhya pradesh)  దారుణ మైన ఘటన జరిగింది. దేవాస్ జిల్లాలో బోర్ పదవ్ లో ఈ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా గిరిజన తెగకు చెందిన  32 ఏళ్ల మహిళ కు ముగ్గురు పిల్లలు. కొన్నిరోజులుగా ఆమె ఇంట్లో నుంచి మాయమైంది. ఆమె కోసం ఊరంతా వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఆమె తనప్రియుడి ఇంట్లో ఉన్నట్లు భర్తకు తెలిసింది. వెంటనే కుటుంబసభ్యులతో కలిసి అక్కడకు వెళ్లారు. ప్రియుడి ఇంట్లో భార్య ఉండటంతో ఆవేషంతో రగిలిపోయాడు.



వెంటనే ఆమెను మెడ పట్టుకుని బైటకు లాక్కొని వచ్చాడు. అందరి ముందే ఆమెను జుట్టుపట్టుకుని లాగి కొడుతూ... చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించాడు. మహిళ భర్త ఆమెపై ఎక్కికూర్చుని.. ఊరంతా తిరిగాడు. కొందరు ఆమెను ఇష్టమోచ్చినట్లు కొడుతున్నారు. మరికొందరు ఈ ఘటనను సెల్ ఫోన్ లలో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ (video viral) కావడంతో ఘటన వెలుగులోనికి వచ్చింది. దీనిపై సీరియస్ అయిన పోలీసులు ఘటనకు కారణమైన 12 మందిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Extramarital affairs, Illegal affairs, Madhya pradesh

తదుపరి వార్తలు