Home /News /crime /

MADHYA PRADESH WOMAN ENDS LIFE AFTER THROWING 2 DAUGHTERS INTO WELL SU

మొబైల్ విషయంలో అత్తాకోడళ్ల మధ్య గొడవ.. అయ్యో ఎంత ఘోరం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొన్ని కొన్ని విషయాలు పెద్ద పెద్ద వివాదాలకు కారణమవుతుంటాయి. అవి ఊహించని పరిణామాలకు దారితీస్తుంటాయి.

    కొన్ని కొన్ని విషయాలు పెద్ద పెద్ద వివాదాలకు కారణమవుతుంటాయి. అవి ఊహించని పరిణామాలకు దారితీస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌లో చోటుచేసుకుంది. అత్తా కోడళ్ల మధ్య మొబైల్‌ ఫోన్ కోసం చోటుచేసుకున్న గొడవ.. ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. వివరాలు.. మధ్యప్రదేశ్ ఛత్తర్‌పూర్‌ (Chhatarpur) లోని సతాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వ గ్రామానికి చెందిన మహిళ ఆదివారం పశువులు మేపేందుకు వెళ్లింది. ఆ సమయంలో ఇద్దరు పిల్లల్ని బావిలోకి విసిరేసింది. ఆ తర్వాత తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఘటనలో మహిళతో పాటు ఆమె పదేళ్ల కూతురు ప్రాణాలు కోల్పోయింది. మరో కూతురు(నాలుగేళ్ల చిన్నారి) మాత్రం బావి ఇటుకల మధ్య చిక్కుకుని ప్రాణాలతో బయటపడింది.

    ఇక, శనివారం ఆత్మహత్య చేసుకన్న మహిళకు ఆమె అత్తకు మొబైల్ విషయంలో గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపం చెందిన మహిళ.. క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా గ్రామస్తులు చెబుతున్నారు. మహిళ  వద్ద ఉన్న మొబైల్‌ను ఆమె అత్త తీసుకోవడమే వాగ్వాదానికి దారి తీసిందని వారు అంటున్నారు. అయితే ఇంత చిన్న విషయానికే మహిళ ఆత్మహత్య చేసుకోవడంతో పాటు, ఒక కూతురు ప్రాణాలు తీయడంతో.. ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

    Married Girl: పెళ్లైన మూడు నెలలకే షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన యువతి.. షాపింగ్ కోసం వెళ్లిన సమయంలో..

    ఇందుకు సంబంధించిన వివరాలను ఛతర్‌పూర్ సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్(SDOP) శశాంక్ జైన్ (Shashank Jain) తెలిపారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న మహిళ.. మొబైల్‌ విషయంలో తన అత్తతో గొడవ పడినట్టుగా తేలిందన్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపారు.

    Hyderabad: భద్రాచలం వెళ్లేందుకు బయలుదేరాడు.. ఈ మహిళ వలపు వలలో చిక్కుకుని..

    మేనత్తతో యువకుడి ప్రేమ..
    మధ్యప్రదేశ్‌లోని సిహావల్‌ మండలంలో ఓ యువకుడు తనకన్నా పెద్దదైన మేనత్తను ప్రేమించాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడింది. ఇద్దరు మధ్య శారీరక సంబంధం ఏర్పడటంతో.. మహిళ గర్బం దాల్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో.. యువకుడు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. అయితే కుటుంబ సభ్యులు ఇందుకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి ఇంట్లో నుంచి పారిపోయారు. అనంతరం సమీపంలోని నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. నదిలోని ఇసుక తిన్నెలపై వారి పడి ఉండటాన్ని గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. అయితే వారిని ఆస్పత్రికి తరలించినప్పటికీ.. ప్రాణాలు కాపాడలేకపోయారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Madhya pradesh, Suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు