Home /News /crime /

భార్యపై అనుమానంతో ఇంటికి వచ్చిన భర్త.. అక్కడ కనిపించిన సీన్ చూసి షాక్.. చివరకు ఏం జరిగిందంటే..

భార్యపై అనుమానంతో ఇంటికి వచ్చిన భర్త.. అక్కడ కనిపించిన సీన్ చూసి షాక్.. చివరకు ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. సడన్‌గా ఆమెను కలిసేందకు ఇంటికి చేరుకున్నాడు. అయితే భార్య తలుపు తీయగానే అక్కడ కనిపించిన దృశ్యాలను చూసి షాక్ తిన్నాడు.

    భార్యపై అనుమానంతో ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లిన భర్తకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆ ఇంట్లో భార్యతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉండటం.. అతడిని తీవ్రంగా కలిచివేసింది. ఇదేమిటని ప్రశ్నించగా.. వారిద్దరితో కలిసి భార్య అతడిపై దాడి చేసింది. నాలుగో ఫ్లోర్ నుంచి అతడిని కిందరకు తోసేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసకుంది. బాధితుడిని హిమాన్షు చౌహాన్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్‌లోని కనడియా పోలీస్ స్టేషన్ పరిధిలోని భూరి టేక్రీ ప్రాంతంలో హిమాన్షు చౌహాన్‌ నివాసం ఉంటున్నాడు. అయితే హిమాన్షు రత్లాంలో‌ పని చేస్తున్నాడని అతని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే భార్యపై అనుమానం పెంచుకున్న అతడు.. సడన్‌గా ఆమెను కలిసేందకు ఇండోర్ చేరుకున్నాడు.

    అయితే భార్య తలుపు తీయగానే అక్కడ కనిపించిన దృశ్యాలను చూసి షాక్ తిన్నాడు. ఎందుకంటే ఇంట్లో భార్యతో మరో ఇద్దరు యువకులు కూడా ఉన్నారు. దీంతో ఇదేమిటని భార్యను ప్రశ్నించాడు. అయితే హిమాన్షు ఇలా చేయడంతో.. అక్కడున్న ఇద్దరితో కలిసి అతడిపై భార్య దాడికి పాల్పడింది. అనంతరం నాలుగోవ అంతస్తు నుంచి హిమాన్షును కిందకు నెట్టివేసింది.

    అయితే హిమాన్షు కేకలు విన్న.. ఆ బిల్డింగ్‌లోని జనాలు బయటకు వచ్చి చూశారు. వెంటనే అతడి అంబులెన్స్ మహారాజా యశ్వంత్ రావు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో హిమాన్ష్ ముఖం, కాలు, నడుము భాగాల్లో తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. బాధితుడి నుంచి వాంగ్మూలం సేకరించారు. అయితే తాను కాలు జారి బిల్డింగ్ మీద నుంచి కింద పడినట్టు హిమాన్ష్ పోలీసులకు చెప్పారు.

    అయితే అతని కుటుంబ సభ్యులు మాత్రం.. ఇందుకు భిన్నమైన వాదన వినిపించారు. భయంతో ఉన్న హిమాన్ష్ అసలు నిజం చెప్పలేకపోతున్నాడని వారు అన్నారు. చోటు, పర్వేజ్ అనే వ్యక్తులతో కలిసి హిమాన్ష్ భార్య.. అతడిపై దాడి చేసిందని వారు ఆరోపించారు. నోట్లో గుడ్డలు కుక్కి.. తీవ్రంగా కొట్టారని.. అందుకే అతని అరుపులు చుట్టుపక్కల వారికి వినిపించలేదని చెప్పారు. చివరకు కిందపడేసిన తర్వాత అరుపులు విని స్థానికులు స్పందించినట్టుగా తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి హిమాన్ష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Extra marital affair, Madhya pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు