హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: ఎంత తాగిన కిక్ ఎక్కడం లేదు.. వైన్ షాప్ పై మందు బాబుల ఫిర్యాదు..

Shocking: ఎంత తాగిన కిక్ ఎక్కడం లేదు.. వైన్ షాప్ పై మందు బాబుల ఫిర్యాదు..

లోకేష్ సాథియా..

లోకేష్ సాథియా..

Madhya pradesh: కొందరు మిత్రులు కలిసి స్పెషల్ గా దావత్ చేసుకొవాలని ప్లాన్ వేశారు. దీనికోసం ఒక వైన్ షాపుకు వెళ్లి మద్యం కొనుగోలు చేశారు. ఆ తర్వాత తమ ఇంటికి వెళ్లి మందు పార్టీ స్టార్ట్ చేశారు.

ప్రస్తుతం అనేక రాష్ట్రాలు మద్యపానం (Ban on Liquor sales) నిషేధించడానికి ప్రయత్నిస్తున్నాయి. మద్యం తాగడానికి అలవాటు పడి అనేక కుటుంబాలు బజారున పడుతున్నాయి. తాము కష్టపడి సంపాదించిన సొమ్మంతా తాగడానికి తగలేస్తున్నారు. దీంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. వీటిని పరిగణలోనికి తీసుకొని మద్యపానం ను కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే, వీటిని భిన్నంగా కొన్ని చోట్ల... మద్యపానం అమలు చేయాలని మందు బాబులు ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. కొందరు మందుబాబులు.. ఎంత మద్యం తాగిన కిక్ ఎక్కలేదని ఏకంగా వైన్ షాపుపై అబ్కారీ శాఖకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. మధ్య ప్రదేశ్ లో (Madhya pradesh)  ఉజ్జయినిలో ఒక వెరైటీ సంఘటన చోటుచేసుకుంది. బహదూర్ గంజ్ లో లోకేష్ సోథియా (42) ఏళ్ల వ్యక్తి.. గత నెలలో ఒక దుకాణం నుంచి కొనుగోలు చేసిన మద్యం తాగినా కూడా కిక్ ఎక్కలేదని ఆగ్రహానికి గురయ్యాడు. లోకేష్ సాథియా.. తన ఫ్రెండ్స్ తో కలిసి దావత్ చేసుకొవాలని ప్లాన్ వేశారు. అప్పుడు స్థానికంగా ఉన్న షాపులో నుంచి మద్యం బాటిళ్లను (Wine bottle) కొనుగోలు చేశారు. ఆ రోజు రాత్రి మద్యం సేవించారు. కానీ వారికి ఎంత తాగిన కిక్ ఎక్కలేదు. మద్యం బాటిళ్లను కల్తీ చేశారని వారు అనుమానం వ్యక్తం చేశారు.

దీంతో కొన్ని బాటిళ్లను అలాగే ఉంచారు. తాజాగా, మందుబాబులు షాప్ పై అబ్కారీ శాఖకు ఫిర్యాదు చేశారు. కల్తీ మద్యం తమకు అంటగట్టారని ఆరోపించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు షాపులోని శాంపుల్స్ సేకరించారు. వాటిని ల్యాబ్ లో పరీకల కోసం తరలించారు. ప్రస్తుతం మందు బాబు ఘటన వైరల్ గా (Viral news)  మారింది. కాగా, కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు.. కల్తీ దారులు.. ప్రతి ఒక్కదానిని కల్తీ చేస్తున్నారు. ఇప్పటికే బియ్యం, పప్పులు, నూనెలు, రకరకాల వస్తువులను కల్తీకి గురౌతున్న విషయం తెలిసిందే.

First published:

Tags: Liquor, Madhya pradesh, VIRAL NEWS, Wine shops

ఉత్తమ కథలు