Home /News /crime /

ఆ విషయాన్ని లైట్‌ తీసుకున్న నర్సు.. ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో నగ్న చిత్రాలు ప్రత్యక్షం.. చివరకు..

ఆ విషయాన్ని లైట్‌ తీసుకున్న నర్సు.. ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో నగ్న చిత్రాలు ప్రత్యక్షం.. చివరకు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆ విషయాన్ని మహిళ నర్సు చాలా తేలికగా తీసుకుంది. అదే ఆమె జీవితంలో పెనుమార్పులకు కారణమైంది. ఆమె కాపురంలో నిప్పులు పోసింది.

    మొబైల్ పొగొట్టుకున్న ఓ మహిళ నర్సు.. ఆ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంది. అయితే ఆ నిర్లక్ష్యమే ఆమె జీవితంలో పెనుమార్పులకు కారణమైంది. ఆమె కాపురంలో నిప్పులు పోసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. గ్వాలియర్‌కు చెందిన మహిళ స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో ఉన్న సమయంలోనే ఆమె ఫోన్ పోయింది. దీంతో మొబైల్ కోసం వెతకగా.. అది దొరకలేదు. దీంతో ఆ విషయాన్ని ఆమె పెద్దగా పట్టించుకోలేదు. అయితే నర్సు భర్త.. చోరి అయిన మొబైల్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి.. ఆమె అసభ్యకర, ప్రైవేటు ఫొటోలు, వీడియోలు ఉన్నాయనిచెప్పాడు. ఆమె ఆస్పత్రితో ఎవరితోనే శారీరక సంబంధం పెట్టుకుందని.. అందుకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని తెలిపాడు. ఆ తర్వాత ఫోన్ కట్ చేశారు.

    ఆ తర్వాత ఫోన్ చోరీ చేసిన వ్యక్తి.. నర్సు ఫోన్ నుంచే కొన్ని అసభ్యకరమైన ఫొటోలను, వీడియోలను ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశాడు. ఆ గ్రూప్‌లో లేని కుటుంబ సభ్యులకు పర్సనల్‌గా వాటిని పంపించాడు. అయితే ఆ దృశ్యాలను చూసిన నర్సు కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. దీంతో ఆమె కుటంబంలో పెద్ద అలజడి రేగింది. బంధువులు కూడా నర్సుపై తీవ్ర మాటలతో వేధించడం మొదలుపెట్టారు. ఈ విషయంలో ఆమెను భర్త కూడా నిలదీశాడు. దీంతో ఆమె కాపురం బజారున పడింది. అయితే ఆ ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసినవని చెప్పిన నర్సు.. మహారాజ్‌పూరా పోలీసులను ఆశ్రయించింది.

    ‘నేను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నాను. మే 2వ తేదీన ఓ పెషేంట్‌ వద్ద విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో నా మొబైల్ ఫోన్ చోరీకి గురైంది. ఆ ఫోన్‌లో వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. అయితే ఫోన్‌ను దొంగిలించిన వ్యక్తి ఫొటోలు మార్ఫింగ్ చేసి.. వాటిని నా కుటుంబ సభ్యులకు పంపించాడు. ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో కూడా వాటిని షేర్ చేశాడు’ అని 28 ఏళ్ల బాధిత నర్సు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక, ఇందుకు సంబంధించి మీడియాతో మాట్లాడిన బాధిత నర్సు.. ఆ ఫొటోలు అన్ని మార్ఫ్ చేసినవని అని చెప్పారు.

    ఇవి చదవండి: పగలేమో భర్త.. రాత్రికి వచ్చేసరికి తండ్రి.. ఇబ్బందేం లేదన్న మహిళ..

    Hyderabad: అలా అడగడమే శాపమైంది.. ముగ్గురు కలిసి ఒంటరి మహిళను..


    ఎదురింటి అంటీకి అంకుల్ లైంగిక వేధింపులు.. ఆమె భర్త ముందే అసభ్య ప్రవర్తన.. చివరకు ఏం జరిగిందంటే..

     డ్రెస్ తీసేసి రారా.. అంటూ కానిస్టేబుల్‌తో గొడవ.. ఆ తర్వాత సీన్ రివర్స్.. Viral Video

    ఈ ఘటనపై మహారాజ్‌పూరా పోలీసు స్టేషన్ ఇంచార్జ్ ప్రశాంత్ యాదవ్ మాట్లాడుతూ..‘ప్రాథమిక విచారణ ప్రకారం.. నర్సు పాత ఫ్రెండ్ ఒకరు ఈ పని చేసినట్టుగా గుర్తించాం. అతను తరచూ నర్సు పనిచేసే ఆస్పత్రికి వచ్చి వెళ్తుండేవాడు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి’అని చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Madhya pradesh

    తదుపరి వార్తలు